Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరురూరల్
కరోనా పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని మండల ఎంపీడీవో జ్ఞాన ప్రకాష్ రావు అన్నారు. శుక్రవారం మండలంలోని షారాజిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సర్పంచ్ బండ పద్మ పర్వతాలు ఆధ్వర్యంలో వారు తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కు శానిటైజర్ తప్పక వాడాలన్నారు.45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం అనుజ. కవిత ,జయమ్మ ,ఆరోగ్య మిత్ర డాక్టర్ సుమ ,నాయకులు రామనర్సయ్య, మహేందర్ ,అశోక్ ,సురేష్, శ్రీధర్ ,బాలయ్య, వైద్య సిబ్బంది ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
భూదాన్‌పోచంపల్లి : పురపాలక కేంద్రంలోని రేవన్నపల్లి గ్రామంలో శుక్రవారం ప్రాథమిక ఆరోగ్యఉప కేంద్రం ఆధ్వర్యంలో కోవిడ్ వ్యాక్సిన్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కౌన్సిలర్ సురకంటి జ్యోతి రంగారెడ్డి హాజరై వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు వరలక్ష్మి ,గీత, ఆశ గీత తదితరులు పాల్గొన్నారు.