Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
ముదిరాజ్‌ల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని మున్సిపల్ చైర్మెన్ వెన్‌రెడ్డి రాజు అన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని లక్కారంలోని 7,8 వార్డుల్లో మత్స్య పారిశ్రామిక సహకారసంఘానికి సంబంధించిన భవన నిర్మాణ స్థలాన్ని సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిలిచిపోయిన భవన నిర్మాణ పనులు పూర్తిచేయించేందుకు సహకరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్చైర్మెన్్ బత్తుల శ్రీశైలం, కౌన్సిలర్లు కాసర్ల మంజులశ్రీనివాస్రెడ్డి, కొయ్యడ సైదులుగౌడ్, మాజీ సర్పంచ్ పాశం సంజరుబాబు, నాయకులు కానుగు బాలరాజు, శ్రీనివాస్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి పాల్గొన్నారు.