Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
మండలంలోని సర్వారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్ముకునే రైతులకు నాణ్యతతో కూడిన గన్నిబ్యాగులు ఇవ్వాలని కోరుతూ గారకుంటతండాకు చెందిన పలువురు రైతులు సంఘం కార్యాలయం ముందు శుక్రవారం కొద్దిసేపు ఆందోళన నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ధాన్యం కోసం చిరిగిపోయిన పాత గన్నీ బ్యాగులివ్వడం వల్ల అవి అక్కడే పగిలిపోతున్నాయన్నారు. దీంతో ధాన్యం కింద పోతుందన్నారు.కిందపోయిన ధాన్యం ఎత్తుకునేందుకు తాము అష్టకష్టాలు పడాల్సి వస్తుందని వాపోయారు.పాత గన్నీ బ్యాగులు కాకుండా నాణ్యతతో కూడిన గన్నీబ్యాగులు రైతులకు ఇచ్చి ఏ విధమైన ఇబ్బందుల్లేకుండా అధికారులు చూడాలన్నారు.ఇదే విషయం గురించి అడిగేందుకు కార్యాలయానికి వెళ్తే కార్యా లయంలో సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడం బాధా కరమన్నారు.గారకుంటతండాలో రైతులు పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకొని కొత్త గన్నీబ్యాగులు అందించి ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో తండాకు చెందిన పలువురు రైతులు పాల్గొన్నారు.
గన్నీబ్యాగులు ఇవ్వకపోవడంతో రైతుల ఆందోళనలు
మండలపరిధిలోని కీతవారిగూడెంలో ఏర్పాటు చేసిన రాయినిగూడెం పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు చేయకపోవడం, గన్నీబ్యాగులివ్వకపోవడంతో రైతులు మిర్యాలగూడ-కోదాడ వెళ్లే రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు.ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ పీఏసీఎస్ రాయినిగూడెం పరిధిలోని కీతవారిగూడెం, మల్కాపురం, వెలిదండ, ఆయా గ్రామాల్లోని పంటపొలాలలోని ధాన్యాన్ని సన్నరకం వడ్లు క్రాఫ్ ముందుగా రావడంతో దాన్యం కొనుగోలుకేంద్రాలు తెరవకపోవడంతో ఆయా గ్రామాల ధాన్యం కొనుగోళ్లు దళారుల చేతిలో తరుగు పేరుతో రెండు కేజీలు నష్టపోయామన్నారు.ఇప్పుడు మిగిలిన 1010 ధాన్యం ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కేంద్రాలు ఓపెన్ చేయడంతో కేంద్రాల వద్దకు వచ్చినా...ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం, గన్నీబ్యాగ్లివ్వకపోవడం దారుణమన్నారు.ధాన్యం కొన్నిరోజులుగా ఎండకు ఎండి అకాల వర్షం వస్తే ఇంకా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికీ అన్ని విధాలుగా తాము నష్టపోయామని, ధాన్యం ఎగుమతి సమయంలో రైతు ట్రాక్టర్లు వాడొద్దని, లారీలతోనే ఎగుమతులు చేయాలని పై అధికారులు చెప్పారని పీఏసీఎస్ అధికారులు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారిపై ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అవడంతో ఎస్సై నర్సింగ్ వెంకన్నగౌడ్ జోక్యం చేసుకొని పీఏసీఎస్చైర్మెన్ ముప్పవరపు రామయ్య, సీఈవో వెంకటేశ్వర్లుతో మాట్లాడి పైఅధికారులతో మాట్లాడి పాత విధానాన్నిఅవలంబించే విధంగా, గన్నీబ్యాగులు ఇప్పించి కొనుగోలు కేంద్రాన్నిఓపెన్ చేయడంతో రైతులు ధర్నాను విరమింపజేశారు.ఈ కార్యక్రమంలో రైతులు, సీపీఐ నాయకులు బాదే నర్సయ్య, కాంగ్రెస్ నాయకులు జుట్టుకొండ సత్యనారాయణ, ఎస్కె.చాంద్మియా, ఆయా గ్రామాల పలువురు రైతులు పాల్గొన్నారు.