Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
చిట్యాల : ప్రజా ప్రతినిధి, కమ్యూనిస్టు నాయకుడు నర్రా రాఘవ రెడ్డిని ప్రజలెవరూ మర్చి పోరని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. నర్రా రాఘవరెడ్డి వర్ధంతి సందర్భంగా శుక్రవారం మండలంలోని వట్టిమర్తి గ్రామంలో ఉన్న ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో నర్రా కన్నారెడ్డి, నర్సమ్మల జ్ఞాపకార్థం నిర్మించిన నర్రా రాఘవరెడ్డి స్మారక భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చెరుపల్లి మాట్లాడుతూ ఆరు సార్లు నకిరేకల్ ఎమ్మెల్యేగా, సీపీఐ(ఎం) శాసనసభాపక్ష నేతగా పనిచేసిన రాఘవరెడ్డి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తనదైన శైలిలో ఎప్పటికప్పుడూ ఎండగట్టారని గుర్తు చేశారు. నేటి ప్రజా ప్రతినిధులు నర్రాను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఆశయ్య, జిల్లా నాయకులు జిట్ట నగేష్, మండల కార్యదర్శి అవిశెట్టి శంకరయ్య, సీనియర్ నాయకులు పామనగుండ్ల అచ్చాలు, రాచమళ్ల రామచంద్రం, మండల నాయకులు రాచకొండ శ్యామ్‌సుందర్, నారబోయిన శ్రీనివాసులు, శీలా రాజయ్య, బూరుగు కృష్ణవేణి, జిట్ట సరోజ, అరూరి శ్రీను, నెలికంటి నర్సింహా, ఐతరాజు నర్సింహా, కత్తుల లింగస్వామి, గోపగోని వెంకన్న, మద్ది లింగయ్య, బూరుగు శ్రీను, మెట్టు పరమేష్, నర్రా బిక్షంరెడ్డి, రమేష్, శంకర్, నార్కట్‌పల్లి మండల కార్యదర్శి చెరుకు పెద్దులు, మండల నాయకులు గాలి నర్సింహా, నాంపల్లి జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
నిజాయితీ, నైతిక విలువలకు మారుపేరు నర్రా రాఘవరెడ్డి
సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నల్లగొండ : నిజాయితీ, నైతిక విలువలకు మారుపేరు నర్రా రాఘవరెడ్డి అని సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అన్నారు. నర్రా రాఘవరెడ్డి 6వ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక దొడ్డి కొమురయ్య భవన్లో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణ, సమయపాలన, ప్రజాసేవ, నిజాయితీ, రాజకీయాల్లో నైతిక విలువలు పాటించిన నాయకుడు నర్రా అని అన్నారు. నేటి రాజ కీయాల్లో ప్రజాసేవను పక్కన బెట్టి వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. ప్రజాస్వామ్య విలువలు రోజురోజుకూ కనుమరుగు అవుతున్న నేపథ్యంలో నేటి యువతరం నర్రా రాఘవరెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, సీపీఐ(ఎం) శాసనసభాపక్ష నేతగా రాఘవరెడ్డి పేదల ప్రజల గొంతుకను అసెంబ్లీలో వినిపించారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఫ్లోరైడ్ బాధితులను ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు దగ్గర తీసుకెళ్లి సమస్య తీవ్రతను చెప్పి వారి పక్షాన పోరాటం చేశారని గుర్తుచేశారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు సాధించడంలో రాఘవరెడ్డి కీలకపాత్ర పోషించారని తెలిపారు. నర్రా రాఘవరెడ్డి ఆశయ సాధన కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, సయ్యద్ హాషం, ఎమ్‌డి.సలీమ్, పి.నర్సిరెడ్డి, చిన్నపాక లక్ష్మీ నారాయణ, ఎం.ప్రభావతి, గంజి మురళి, దండంపెల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, డి.సరోజా, అరుణ, ఉమా, నర్సింహా, కత్తుల యాదయ్య, కొండా వెంకన్న, ఇస్తారి, రవి, శ్రీనివాస్, పాల్గొన్నారు.