Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
నేరేడుచర్ల ఎన్నెస్పీ క్యాంపు కాంపౌండు ఆవరణలో 40 ఏండ్లుగా నివాసముంటున్న నిర్వాసితులకు న్యాయం చేయాలని అఖిలపక్ష నాయకులు నిర్వాసితులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ పారేపల్లి శేఖర్‌రావు, సీపీఐ జిల్లా నాయకులు ధూళిపాల ధనుంజయనాయుడు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పాల్వాయి రమేశ్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కొదమగుండ్ల నగేష్, మాట్లాడారు.ఎన్నెస్పీ గేట్ పక్కన ఎన్నో ఏండ్లుగా నివాసం ఏర్పాటు చేసుకుని చేతివత్తులు, కులవత్తులు చేసుకుంటూ కుటుంబాలను పోషించు కుంటు న్నారన్నారు.వారిని ఖాళీ చేయించేందుకు కలెక్టర్‌తో పాటు మున్సిపల్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, రెండు రోజులు ఖాళీ చేయకపోతే పోలీస్ ఫోర్స్ ఉపయోగించి జేసీబీలు పెట్టి ఇళ్లు కూల్చివేస్తామని బెదిరిస్తున్నారని విమర్శించారు. పేదలు నివాసం ఉండేందుకు ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేశారు. వారికి ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపించకుండా బలవంతంగా ఖాళీచేయిస్తే సహించబోమని హెచ్చరించారు. పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీలతో పాటు వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు.మున్సిపల్ కమిషనర్ వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరి సూచనల మేరకు శాంతియుతంగా సమస్యలు పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ పార్లమెంటరీ అధ్యక్షులు పొనుగోటి జంగయ్య, మహిళా సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మీ, సీఐటీయూ మండల కార్యదర్శి నీలా రామ్మూర్తి, ఏఐఎస్ఎఫ్ మండల కన్వీనర్ కొమర్రాజు వెంకట్, నిర్వాసితులు, మోహన్‌రెడ్డి, జంగాల మధు, ఎస్కె రసూల్, పాశం వెంకమ్మ, బండి సైదులు, ఆకుల రవి, పేరూరి సైదులు, షేక్ మహబూబి, షేక్ షాజహాన్, బీవీకే నాగలక్ష్మీ, బల్మూరి అలివేలమ్మ, బల్మూరి వెంకటాచారి, షేక్ సైదా, జంగాల ప్రసాద్, వింజమూరి ఎల్లయ్య పాల్గొన్నారు.