Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్లు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కొంతమంది గిట్టని వారు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని తాము అవినీతిని మాత్రమే అడ్డుకుంటున్నామని కౌన్సిలర్ల ప్లోర్‌లీడర్ కస్తాల శ్రావణ్ అన్నారు.శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని మెయిన్‌రోడ్డుపై పైపు లైను మార్చుటకు రూ.44 లక్షల వ్యయం అవుతుందని మున్సిపాలిటీ ఎజెండాలో పెట్టి ప్రస్తుతం అదే పైపులైన్ అమలుచేసేందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేలా ఖర్చులు రెండింతలు పెంచి రూ.88 లక్షలతో నియోజకవర్గ అధికార పార్టీ ప్రతినిధి నాయకునికి పనులు అప్పజెప్పుతున్నారని ఆరోపించారు. రోడ్డుపై పనులు జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల అనుమతులు ఉండాలని, కానీ మున్సిపల్ కమిషనర్ అనుకూలంగా వ్యవహరిస్తు న్నారన్నారు.తమ పార్టీ కౌన్సిలర్లు అభివృద్ధి పనులను ఎక్కడా అడ్డుకోలేదన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కె.విజయ, వరలక్ష్మీ, ధనమ్మ, సరిత, రాజు పాల్గొన్నారు.