Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేములపల్లి
రైతులు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని డీపీఎం వెంకటేశం కోరారు. శుక్రవారం మండలంలోని తిమ్మారెడ్డిగూడెం, మొల్కపట్నం, రావులపెంట, ఆమనగల్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అధికారులు, నిర్వాహకులు సమన్వయంతో పని చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పుట్టల సునీత కృపయా, వైస్ ఎంపీపీ పాదూరి గోవర్ధనశశిధర్రెడ్డి, సర్పంచ్‌లు దేశిరెడ్డి లక్ష్మి, నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, చెరుకుపల్లి కృష్ణవేణి, దొంతిరెడ్డి, వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీలు నంద్యాల శ్రీరామ్‌రెడ్డి, మేక లలిత, ఆర్ఐ సాయి, ఏపీఎం అనూక్, సీసీలు పాల్గొన్నారు.
నకిరేకల్: గ్రామాల్లో రైతుల కోసం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ శ్రీను కోరారు. శుక్రవారం మండలంలోని చందనపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు చెత్తా చెదారం, తాలు లేకుండా 17 శాతం తేమ గల ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం ప్రభాకర్, సీసీ పద్మ, మాజీ సర్పంచ్ నూకల రఘునందన్‌రెడ్డి, వీబీకేలు రేణుక, రాజేశ్వరి, రైతులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ: రైతులు కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని పీఏసీఎస్ డైరెక్టర్ బంటు శ్రీనివాస్ కోరారు. శుక్రవారం మండలంలోని నందిపాడు, చిల్లాపురం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తేమ 17 శాతం ఉండేలా ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు. ప్రభుత్వం ఎ-గ్రేడ్‌కు రూ.1888, బి-గ్రేడ్‌కు రూ.1868లు ధర అందిస్తుందన్నారు. రైతులు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని, మాస్క్ ధరించి కేంద్రాలకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పత్తిపాటి వెంకటేశ్వర్లు, సంఘం సీఈఓ మచ్చలచ్చయ్య, పాలక వర్గ సభ్యులు పి.జానకిరెడ్డి, వి.శ్రీనివాస్, నాగయ్య, శ్రీనివాసరెడ్డి, రాములమ్మ, రైతులు గోవిందరెడ్డి, సైదిరెడ్డి, మతిన్, చిల్లాపురం సర్పంచ్ ఎం.అనూష, రేణుబాబు, డైరెక్టర్లు ఎం.చంద్రకళ, వెంకన్న, రైతులు శ్రీనివాసరెడ్డి, బుర్రి శ్రీనివాసరెడ్డి, కోటిరెడ్డి, సిబ్బంది సతీశ్, శ్రీను, సైదులు, విజరు పాల్గొన్నారు.
దామరచర్ల: మండలంలోని దామరచర్ల, కొండ్రపోల్, పార్టునాయక్తండా, నర్సాపురం, తెట్టేకుంట గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మెన్ నారాయణ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వీరకోటి రెడ్డి, ఎంపీపీ నందిని, జెడ్పీటీసీ లలిత, టీఆర్ఎస్ నాయ కులు హతిరామ్, నర్సయ్య, నాగిరెడ్డి పాల్గొన్నారు.
త్రిపురారం: ప్రతి ఒక్కరూ ఆరబెట్టిన ధాన్యాన్ని తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని ఏపీఎం దిలీప్‌కుమార్ కోరారు. శుక్రవారం మండలంలోని నీలాయిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీసీలు హేమానాయక్, మురళి, రేణుక, అరుణ, సువర్ణ, రాజ్యలక్ష్మి, కేంద్రం నిర్వాహకులు సరిత పాల్గొన్నారు.
నార్కట్‌పల్లి: మండల పరిధిలోని తొండ్లాయి, మాండ్ర, శాపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ శేఖర్ రెడ్డితో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బింగి కొండయ్య, రమేష్, దొండ సౌమ్య రమేష్, కర్ణాటి ఉపేందర్, ఏపీఎం కృష్ణ, మండల వ్యవసాయ అధికారి గిరి ప్రసాద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, ఏఈవో లియాకత్‌అలీ పాల్గొన్నారు.