Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేతెపల్లి: మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు నర్రా రాఘవరెడ్డి 6వ వర్థంతిని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పలువురు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బోళ్ల నర్సింహారెడ్డి మాట్లాడుతూ రాఘవరెడ్డి ప్రజా సమస్యలపై నిత్యం శాసనసభలో తనదైన శైలీలో తన వాగ్దాటిని వినిపించారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి చింతపల్లి లూర్థు మారయ్య, కోట లింగయ్య, సుధీర్, కిరణ్, సత్తిరెడ్డి, ఉపేందర్ పాల్గొన్నారు.
నకిరేకల్ : నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు నర్రా రాఘవరెడ్డి 6వ వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం స్థానిక నర్రా రాఘవరెడ్డి భవనంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందాల ప్రమీల, సీనియర్ నాయకులు బి.ప్రకాష్‌రావు మాట్లాడుతూ నకిరేకల్ నియోజకవర్గానికి ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. నీతి, నిజాయితీకి మారుపేరుగా నిలిచిన వ్యక్తి రాఘవరెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి రాచకొండ వెంకట్ గౌడ్, రైతు సంఘం నాయకులు యానాల కృష్ణారెడ్డి, నాయకులు వంటెపాక వెంకటేశ్వర్లు, రావిరాల మల్లయ్య, బహురోజు ఇందిరా, వంటెపాక కృష్ణ, చిన్నబోయిన నాగమణి, పుట్ట సత్తయ్య, శశికళ, కంబాల సోమయ్య, రామ్ బ్రహ్మచారి పాల్గొన్నారు.
వేములపల్లి : మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి సేవలు మరువలేనివని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు పురుషోత్తంరెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో రాఘవరెడ్డి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. రాఘవరెడ్డి ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి పాదూరి శశిధర్‌రెడ్డి, కోడిరెక్క వెంకన్న, బోడెమ్మ, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.మిర్యాలగూడ :నర్రా రాఘవరెడ్డి ఆశయాలు సాధించాలని సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు మాలి పురుషోత్తంరెడ్డి కోరారు. నర్రా రాఘవరెడ్డి వర్థంతి సందర్భంగా స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్రా రాఘవరెడ్డి ఆరుసార్లు నకిరేకల్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారన్నారు. తన జీవితకాలం కమ్యూనిస్టు ఆదర్శాలను విడవకుండా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుండే వారన్నారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తన జీవితాంతం పేద ప్రజలకు అంకితం చేసిన మహా నాయకుడు నర్రా అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి నూకల జగదీశ్చంద్ర, జిల్లా కమిటీ సభ్యులు మల్లు గౌతమ్‌రెడ్డి, వేములపల్లి వైస్ ఎంపీపీ పాదూరి గోవర్థన శశిధర్‌రెడ్డి, రైతు సంఘం నాయకులు రాగిరెడ్డి మంగారెడ్డి, గోవిందరెడ్డి, పాల్వాయి రాంరెడ్డి, రామకృష్ణ, సీతారాములు, వెంకారెడ్డి పాల్గొన్నారు. తిప్పర్తి :మండల కేంద్రంలోని నర్రా రాఘవరెడ్డి భవన్లో శుక్రవారం సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడు నర్రా రాఘవరెడ్డి 6వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి మన్నెం బిక్షం మాట్లాడుతూ పేద ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి నర్రా అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు బీరెడ్డి సీతారాంరెడ్డి, నన్నూరి వెంకటరామణరెడ్డి, భీమగాని గణేష్, గంటెకంపు రమణయ్య, చెనగోని వెంకన్న, ఎమ్‌డి.లతీఫ్, రొట్టెల జానయ్య, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
కట్టంగూరు : మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సైదులు కోరారు. నర్రా వర్ధంతి సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మత్స్స కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మురారి మోహన్, పార్టీ మండల కమిటీ సభ్యులు దండెంపల్లి శ్రీను, దుప్పెల్లి నాగయ్య, గుడుగుంట్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.