Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నూతనకల్
ఎస్సారెస్పీ కాలువల ద్వారా గోదావరి జలాలను విడుదల చేసి మండలంలో ఎండిపోతున్న వరిపొలాలను కాపాడాలని కోరుతూ సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి డేవిడ్కుమార్ శుక్రవారం జిల్లాకేంద్రంలో ఎస్సారెస్పీ ఎస్ఈ పీవీఎస్ నాగేశ్వర్రావుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీరు వస్తుందని బీడు భూములను వేల రూపాయలు అప్పు చేసి వరిపంట పెడితే ప్రభుత్వం నీరందించడంలో విఫలమైందని ఆరోపిం చారు.రూ.వేలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన రైతుకు కన్నీరు మిగులుతుందన్నారు.పూర్తి స్థాయిలో చివరి భూముల వరకూ నీరందిస్తామని చెప్పిన కేసీఆర్ రాష్ట్రంలో ఒక ఎకరా భూమి కూడా ఎండిపోవద్దని మాట్లాడిన సీఎం నేడు మండలంలోని అన్ని గ్రామాలలో వరి పంట ఎండిపోతున్న పరిస్థితి ఉందన్నారు. అలాగే 69 డీబీఎం కాలువకు సంబంధించిన నీరు మొత్తం వేరే డీబీఎంకు తరలిస్తున్నారని వాపోయారు. మండలానికి రావాల్సిన నీళ్లను విడుదల చేసి ఎండిపోతున్న పొలాలను కాపాడాలని కోరారు.వినతిపత్రం అందజేసిన వారిలో ఆ పార్టీ డివిజన్ కార్యదర్శి కార్యదర్శి గంటానాగయ్య, పెద్దింటి రంగారెడ్డి, దేశోజుమధు, ముండ్లమల్లయ్య, బాణాల వెంకటరెడ్డి, పులుసు సైదులు, సామ నర్సిరెడ్డి ఉన్నారు.