Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
రైతులు ధాన్యం కొనుగోలుకేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ గుండగాని కవిత రాములుగౌడ్ అన్నారు.శుక్రవారం మండలకేంద్రంతో పాటు, కేశవపురం, వెంపటి, అన్నారం,మంచ్యతండా, గానుగుబండ గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలకేంద్రాలను ఆమె ప్రారంభించి మాట్లాడారు.ప్రభుత్వం కరోనా దష్ట్యా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు.తమది రైతు పక్షపాత ప్రభుత్వమన్నారు.మండలంలో 14 ఐకేపీ సెంటర్లు, మూడు సొసైటీ సెంటర్లను ఏర్పాటు చేసిందన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండజిల్లా డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు,మార్కెట్ కమిటీ చైర్మెన్ పులుసు యాదగిరి, వైస్‌ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం యాదవ్, టీిఆర్‌ఎస్ జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ,్ తాటికొండ సీతయ్య, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు నల్లు రామచంద్రారెడ్డి, కేశవాపురం, వెంపటి, అన్నారం గ్రామాల సర్పంచులు మిరియాల అనిత జనార్దన్, అబ్బగాని పద్మ సత్యనారాయణ,మిట్టగడుపుల అనోక్, వెంపటి ఎంపీటీసీ గుండగాని వీరస్వామి, సొసైటీ డైరెక్టర్ పులుగుజ్జు యాకయ్య, మజీద్, ఏఈఓ మనోహర్, సొసైటీ సీఈఓ వెంకటేశ్వర్లు, ఏపీఎం ఆనంద్, సీసీ సుధాకర్, దొంగరి శ్రీనివాస్, గుండగాని దుర్గయ్య, కడెం సైదులు, యాదగిరి, బోర నరేష్, కేంద్రం నిర్వాహకులు రమణ, జయమ్మ పాల్గొన్నారు.
నూతనకల్: ధాన్యం కొనుగోలుకేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ భూరెడ్డి కళావతిసంజీవరెడ్డి, జెడ్పీటీసీ కందాల దామోదర్‌రెడ్డి సూచించారు. మండలంలోని యడవెల్లి, వెంకేపల్లి, తాళ్లసింగారం,టీక్యాతండా గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఇందిరా, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు చూడి లింగారెడ్డి, సర్పంచులు కొచ్చర్ల బాబు, మాతంగి సోమనర్సమ్మ, ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు ఏర్పుల నరేష్ ఏపీఎం కర్నాకర్, సీసీలు బాణాల నాగార్జునరెడ్డి, ముత్తయ్య, టీఆర్ఎస్ నాయకులు ఎలిమినేటి కష్ణ, ప్రశాంత్, జటంగి గంగయ్య పాల్గొన్నారు.
మోతె :మండలంలోని సిరికొండ, నామవరం గ్రామాల్లో ధాన్యం కొనుగోలుకేంద్రాన్ని ఎంపీపీ ముప్పని ఆశాశ్రీకాంత్రెడ్డి,సిరికొండ పీఏసీఎస్ చైర్మెన్ కొండపల్లి వెంకట్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీఓ గోలి శ్రీనివాస్ ,డీఎస్సీఓ ఏడీ నాగేశ్వర్రావు, క్లస్టర్ అధికారి డి.కష్ణ, మానిటరింగ్ అధికారి అమరేందర్,టీఆర్ఎస్ మండలఅధ్యక్షులు శీలం సైదులు, ఎంపీటీసీ మద్ది మధు,సీఈఓ బాణాల అనంతరెడ్డి, బ్యాంకు సిబ్బంది శ్రీను,పి.మధు, సతీష్ పాల్గొన్నారు.
అనంతగిరి: మండలపరిధిలోని పాలవరం గ్రామంలో ధాన్యం కొనుగోలుకేంద్రాన్ని మార్కెట్ చైర్మెన్ బుర్రా సుధారాణి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఉమా శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ చుండూరు వెంకటేశ్వరరావు ,మట్టపల్లి పుల్లయ్యగౌడ్, పుల్లారెడ్డి, లక్ష్మయ్య, మట్టపల్లి సైదులు,అల్లు వెంకన్న, కష్ణప్రసాద్ పాల్గొన్నారు.
నాగారం: మండలంలోని వర్ధమానుకోట గ్రామంలో ధాన్యం కొనుగోలుకేంద్రాలను ఎంపీపీ మణివెంకన్న ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోయిని శోభా లింగమల్లు, ఎంపీటీసీ అదిరేటి స్వప్న అంజి, టీఆర్ఎస్ మండల నాయకులు కడియం పరమేశ్వర్, ఈదుల కిరణ్‌కుమార్,యారాల రాంరెడ్డి, ఏపీఎం నాగేశ్వర్ పాల్గొన్నారు.