Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్‌కుమార్ సుల్తానియా
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం పంచాయతీరాజ్ శాఖ పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్లందరికి కోవిడ్ టీకా వేయంచడానికి చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఛీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫిసర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా గ్రామీణ అభివద్ధి అధికారులకు చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్‌కుమార్ సుల్తానియా సూచించారు.శుక్రవారం హైదరాబాద్ నుండి పీఆర్ కమిషనర్ రఘునందన్‌రావు, వైద్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు ఇతర శాఖల ఉన్నతాధి కారులతో కలసి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిషత్ చైర్మెన్లు, జెడ్పీటీసీలు, మండల పరిషత్ అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు సభ్యులతో పాటు పంచాయతీరాజ్, ఈజీఎస్, సెర్ప్ ఉద్యోగులకు రాబోయే నాలుగు రోజులలో కోవిడ్ టీకా వేయించాలని సూచించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 65,108 మందిని టీకా వేయడానికి గుర్తించగా, ఇప్పటి వరకు 21,849 మందికి టీకాలు వేశామన్నారు. మిగిలిన వారికి ఈ నెల 14వ తేదీ వరకు వేయించాలని స్పష్టం చేశారు. మండల స్థాయిలో ఎంపీడీఓ నోడల్ అధికారిగా ఈ కార్యక్ర మాన్ని విజయవంతం చేయించాలని, జిల్లా స్థాయిలో స్థానిక సంస్థల అదనపు జిల్లా కలెక్టర్లు ,జెడ్పీ సీఈఓలు, డీఆర్ డీఓ, డీపీఓలు బాధ్యత తీసు కోవాలన్నారు.అనంతరం అదనపు కలెక్టర్ పద్మజారాణి మాట్లాడుతూ ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా వచ్చే నాలుగు రోజులు ఇప్పటికే గుర్తించిన వారందరికీ వ్యాక్నినేషన్ చేపట్టనున్నట్టు వివరించారు. అలాగే జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీలలో పారిశుధ్య పనులు ఎప్పటికప్పుడు చేపడుతున్నామన్నారు.జిల్లాలో అన్ని పీహెచ్సీలలో మందుల కొరత లేకుండా వైద్యాధికారులు మండల టీమ్‌లతో నిరంతర పర్యవేక్షణ చేపడ్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఆపీసర్లు విజయలక్ష్మీ, ప్రేమ్‌కరణ్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిరణ్‌కుమార్, ఎంపీఓలు పాల్గొన్నారు.