Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
ఖమ్మంలో నిర్వహిస్తున్న సంకల్ప సభకు హైదరాబాద్ నుంచి వెళ్తున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిలకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రజలు అభిమానులు ఘనస్వాగతం పలికారు.ఖమ్మం జిల్లా కేంద్రంలోని పెవిలియన్ గ్రౌండ్లో శుక్రవారం సభ జరిగింది. ఇందుకోసం ఆమె లోటస్‌పాండ్‌లోని తన నివాసం నుంచి భారీ కాన్వారుతో బయలుదేరి వెళ్లారు.ఈ సందర్భంగా షర్మిల పది నిమిషాల పాటు రోడ్ షో నిర్వహించారు.అనంతరం ఖమ్మం వైపు వెళ్లిపోయారు. సంకల్ప సభలో షర్మిలతోపాటు వైస్ సతీమణి, వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయ లక్ష్మి పాల్గొననున్నారు. తెలంగాణ రాజకీయాల్లో తన పాత్ర ఏంటన్న దానిపై సంకల్పసభ ద్వారా షర్మిల స్పష్టత ఇవ్వనున్నారు . తెలంగాణలో రాజన్న సంక్షేమపాలన మళ్లీ తీసుకురావాలన్నదే తన సంకల్పమన్న సంగతి ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీ సమీక్షా సమావేశాల్లో ఆమె వెల్లడించారు. ఖమ్మం సంకల్ప సభలో తన సంకల్పం ఏంటన్నది ప్రజలకు వివరించనున్నారు.
మోతె : వైఎస్ఎస్ఆర్ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు ఖమ్మం సూర్యాపేట రహదారి మార్గంలో మండల పరిధిలోని రాఘవపురం ఎక్స్ రోడ్డు వద్ద ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిపాల వేణు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు శుక్రవారం ఘన స్వాగతం పలికారు.హైదరాబాద్ నుండి ఖమ్మంలో జరుగు సంకల్పసభకు వెళ్తుండగా కోదాడ నియోజకవర్గంలోని మోతె,మునగాల, నడిగూడెం, చిలుకూరు, కోదాడటౌన్, కోదాడరూరల్, అనంతగిరి మండలాల ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని స్వాగతం పలికారు.ఈ సందర్భంగా షర్మిల ప్రజలకు కతజ్ఞతలు తెలిపారు.