Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడ రూరల్
ప్రయివేట్ విద్యాసంస్థలను ప్రారంభించాలి లేదా ప్రయివేట్ ఉపా ధ్యాయులు, అధ్యాపకులకు కరోనా భతి చెల్లించాలని సీపీఐ,టీడీపీ, సీపీఐ(ఎం), న్యూడెమోక్రసీ నాయకులు డిమాండ్ చేశారు.పదిరోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షలు చేస్తున్న అధ్యాపకులు, ఉపాధ్యా యులకు నిమ్మరసం అందించి దీక్షలను విరమింపజేశారు.ఈ సందర్భంగా పలువురునాయకులు మాట్లాడుతూ ప్రతి నెలా వారికి రూ.2 వేలు, 25 కిలోల బియ్యం ఇస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమములో నాయకులు మేకల శ్రీనివాసరావు,ఓరుగంటి ప్రభాకర్, ముత్యాలు, ఉదయగిరి, చేపూరి కొండలు ఈవీరెడ్డి,ఎస్వీ విద్యాసంస్థల చైర్మెన్ ఎస్ఎస్.రావు, ఎం.సైదేశ్వర్రావు, పాఠశాలల కరెస్పాండెంట్స్ కోటిరెడ్డి, నాగేశ్వర్రావు, నర్సింహారావు, శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు నాగమణి, వెంకటరెడ్డి, రాంబాబు, జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.