Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అడ్డగుడూర్
ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) చేపట్టిన జన చ్తెతన్య పాదయాత్ర రాత్రి అడ్డగూడూరు మండల కేంద్రం నుండి ఉదయం శుక్రవారం గోవిందపురం నుండి కోటమర్తికి చేరుకుంది. కోటమర్తిలో ఆ పార్టీ గ్రామకార్యదర్శి చిత్తలూరి కష్ణ, మండల నాయకులు నాగేశ్వర్రావు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. ఆయాగ్రామాల్లో జెండాను ఆవిష్కరించారు. కళాకారుల పాటలతో ప్రజలను చైతన్య పరిచారు. జనసమితి యువజన నాయకులు సంఘీభావం తెలిపారు.కోటమర్తి గ్రామంలో పలువురు ఆ పార్టీలో చేరారు. పాదయాత్ర బందంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహాంగీర్ ,రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సిహ్మ , జిల్లా కార్యవర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, బట్టుపల్లి అనురాద ,కోమటి చంద్రారెడ్డి, ధారవత్ రమేష్ నాయక్, సీపీఐ(ఎం), సీపీఐ నాయకులు ,వివిధ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.