Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాదయాత్ర బృందం సభ్యులు కొండమడుగు నర్సింహ
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుంది.జిల్లాలలో 3,34,611 మంది ఉపాధికూలీలు,1,54,576 జాబ్ కార్డులున్నాయి.చేతినిండా పని ఉంది, వలసలు కూడా తగ్గుముఖం పట్టాయి. కూలీల సంఖ్య పెరుగుతుందే కానీ... వేతనం తగ్గుతుంది.రైతులు వ్యవసాయ కూలీలుగా మారుతున్నారు.కరోనా నేపథ్యంలో గ్రామాలకు నిరుద్యోగులు వచ్చారు. వారు కూడా ఉపాధికూలీలుగా మారారు.అయితే కూలీలకు పని కూలీ లెక్క చేసిన తర్వాత ఇవ్వాల్సిన ప్లే స్లిప్ ఇవ్వడంలేదు.దీని వెనుక కుట్ర దాగి ఉంది.స్లిప్ ఇస్తే రోజుకు ఎంత కూలీ పడుతుందనేది తెలుస్తుంది. ఇవ్వకపోవడం వల్ల కూలీ దోపిడీ జరుగుతుంది.వాస్తవంగా వేతనం రూ.257 రావాల్సి ఉంటది..కానీ ప్రస్తుతం కూలీలకు కేవలం రూ.110 మించడంలేదు. ఈజీఎస్‌లో యంత్రాలను ఉపయోగిస్తున్నారు.చట్టం నిబంధనల ప్రకారం యంత్రాలను ఉపయోగిస్తే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.పీడీ ఏ గ్రామాన్ని కూడా సందర్శించలేదు. కూలీల కష్టసుఖాలు పట్టించుకోకుండా ఆఫీస్‌కే పరిమితమై ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.పనిచేసే చోట కనీస వసతులు కూడా కల్పించడంలేదు.ఇదే విషయాన్ని గతంలో అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. చట్టం మొదలైన రోజున వచ్చిన పనిముట్లను వాడుతున్నారే తప్ప కొత్తవి తెచ్చిన దాఖలాలు లేవు.పిట్టలగూడెం,మధిర గ్రామాల్లో ఒక్కరికి కూడా జాబ్‌కార్డులు ఇవ్వకపోవడం దారుణం.ఆ విషయం జిల్లా పీడీకి తెలియదు. చెప్పిన స్పందించని పరిస్థితి. ప్రజాపంపిణీ వ్యవస్థ నిత్యావసర వస్తువుల నియంత్రణ చట్టం ఎత్తివేయడం వల్ల బ్లాక్‌మార్కెట్‌కు తరిలించే అవకాశం ఉంది. ఎఫ్సీఐలను రద్దు చేస్తున్నారు. పీడీఎస్ రద్దుకు కుట్ర చేస్తున్నారు. కేవలం బియ్యం మాత్రమే తెలంగాణాలో ఇస్తున్నారు. కేరళలో 17రకాల వస్తువులు ఇస్తున్నరు. అదే మాదిరిగా మన తెలంగాణలో కూడా అందించాలి.ఎస్సీ సంక్షేమ రంగంలో పూర్తిగా మరిచిపోయారు.2018-19లో బడ్జెట్ కేటాయించి రుణాలివ్వలేదు.2019-20లో నిధులు వేలు. ఈసారి 343యూనిట్లు మాత్రమే మంజూరయ్యాయి.దరఖాస్తులు మాత్రం 4533 ప్రభుత్వానికి అందాయి. జిల్లాలో భూపంపిణీ 4 మండలాలు, నాలుగు గ్రామాలలో 81 మంది లబ్దిదారులకు 168 ఎకరాల 18గుంటలు మాత్రమే పంపిణీ చేశారు.అవి కూడా గుండాల, వలిగొండ,మోత్కూరు, అడ్డగూడూరు మండలాలు.హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న మండలాలలో కూడా భూపంపిణీ చేయాలి.సబ్‌ప్లాన్ నిధులను పక్కదారి పట్టిస్తున్న అధికారులపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలి.ఎస్సీ కాలనీలకు సంబంధం లేకుండా సీసీరోడ్లు వేస్తూ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. దీనిపై విచారణ చేసి దోషులపై చర్యలు తీసుకోవాలి.50శాతం గ్రామాలు కనీస సౌకర్యాలు లేక అల్లాడుతున్నాయి.సబ్‌ప్లాన్ నిధులు మూసీ ప్రక్షాళనకు వాడడం దుర్మార్గం.ఎస్సీ జనాభా 1,34,183 జనాభా కాగా 36 వేల కుటుంబాలున్నాయి. 50 శాతం మందికి సెంటుభూమి లేదు.నూతన వ్యవసాయ పాస్‌బుక్కులు ఇవ్వడం లేదు.పాత బుక్కులున్నా కొత్తవి ఇవ్వడంలేదు.అటవిభూములు, రాచకొండ భూములు, ఎస్సీ, ఎస్టీ భూములు అధికారులు ఆన్లైన్లో నమోదు చేయించడం లేదు. బీబీనగర్ మండలం రాయరావుపేట గ్రామంలో 120 మంది లబ్దిదారులకు కేటాయించిన ఇండ్ల స్థలాలను ప్రభుత్వం బలవంతంగా గుంజుకుంటుంది.ఇసుక అక్రమ రవాణను అడ్డుకుంటున్న దళిత సర్పంచులను వేధిస్తున్న తీరు అన్యాయం.దీనిపై ప్రభుత్వం విచారణ చేయాలి.అనుమతి లేకుండా ఇసుక తీసుకెళ్లడం చట్టరీత్య నేరం .. అక్రమ రవాణాదారులపై చర్యలు తీసుకోవాలి..