Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, జిల్లా రెవెన్యూ ఆఫీసర్ విజయ కుమారి
నవతెలంగాణ -భూదాన్‌పోచంపల్లి
పిల్లాయిపల్లి కాలువ ఆధునీకరణలో భాగంగా మెహర్ నగర్ గ్రామంలో ఇండ్లు కోల్పోతున్న వారికి ప్రభుత్వం నిర్ణయించిన రేటు ప్రకారమే నష్టపరిహారం చెల్లిస్తామని. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జిల్లా ,రెవెన్యూ అధికారి విజయకుమార్ తెలిపారు. శుక్రవారం మండలంలోని మెహర్ నగర్ గ్రామంలో పిల్లాయిపల్లి కాలువ ఆధునికరణలో భాగంగా కోల్పోతున్న 42ఇండ్ల సర్వే నిర్వహించారు. సర్వేను ఆమె పరిశీలించి మాట్లాడుతూ పిల్లాయిపల్లి కాలువ ఆధునీకరణ పనుల్లో భాగంగా ఇల్లు కోల్పోతున్న భూనిర్వాసితులు మార్కెట్ అనుకూలంగా రేటు చెల్లించాలని పలుమార్లు విజ్ఞప్తులు చేసుకున్న నేపథ్యంలో మరోసారి సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన రేటు అనుసారంగానే చెల్లిస్తామన్నారు. పిల్లాయిపల్లికాలువ పనులు ముగింపు దశకు వచ్చాయాన్నారు. ఈకార్యక్రమంలో ఆర్అండ్బీ ఈఈ శంకరయ్య, డీఈ కష్ణారెడ్డి, ఎమ్మార్వో దశరథ్ నాయక్, సర్పంచ్ స్వాతి వెంకటేష్, సీనియర్ అసిస్టెంట్ రవీందర్ రెడ్డి, శోభ రెడ్డి, ఉప సర్పంచ్ ఆకుల రామచంద్రం పాల్గొన్నారు.