Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
107 సర్వే నెంబర్లు ప్రభుత్వ భూమిని కాళేశ్వరం భూనిర్వాసితులకు కేటాయించాలని మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ కోరారు. శుక్రవారం భువనగిరి హుస్నాబాద్ లో 107 సర్వే నెంబర్లలో కాళేశ్వర భూనిర్వాసితుల కోసం భూ సేకరణ చేయడానికి భాగంగా ఇన్చార్జి ఆర్డీఓ సూరజ్ కుమార్, భువనగిరి మండలం తహసిల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, కాలేశ్వరం ప్రాజెక్ట్ ఈ ఈ ఖుర్షీద్ భువనగిరి మండల సర్వేయర్ శ్రీనివాస్ నాయక్ 107 సర్వేనెంబర్లో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమోద్ , రైతులతో కలిసి ఆర్డీఓ సూరజ్ కు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూమి ఉండగా ప్రవేట్ భూములను, సన్నకారు రైతుల భూములను లాక్కో కోవద్దన్నారు. సర్వే నెంబర్ 107 లోనే భూనిర్వాసితులకు భూములు కేటాయించాలని కోరారు. కాలేశ్వరం ప్రాజెక్టు వారిచ్చిన రిక్రియేషన్ సర్వే నెంబర్లు 65, 67, 69, 70,71,72,73,77,85, 86 ఈ భూములను రిక్రియేషన్ రద్దు పర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ గుండెగల అంజమ్మ ఎల్లయ్య, 23వ వార్డు కౌన్సిలర్ పడిగెల రేణుక, రైతులు గోమారి పద్మా రెడ్డి, కొలను సుదర్శన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, కొమురయ్య, చంద్రయ్య, లక్ష్మమ్మ, అంజయ్య యాదవ్, గోమారి మోహన్ రెడ్డి,ప్రతాపరెడ్డి, మాటూరి బలేశ్వర్, పడిగెల ప్రదీప్ పాల్గొన్నారు.
సూరజ్ కుమార్ తో మాట్లాడిన ఎంపీ
భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇన్చార్జి ఆర్డీఓ సూరజ్ కుమార్ తో ఫోన్లో మాట్లాడారు. చిన్న సన్నకారు రైతుల భూములను లాక్కోవాలని 107 సర్వేనెంబర్లోనే భూనిర్వాసితులకు భూములు ఇవ్వాలని, రైతులకు అన్యాయం చేయొద్దని కోరారు.