Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ నల్ల మాస రమేష్ గౌడ్, ఎంపీపీ నరాల నిర్మల వెంకట స్వామి యాదవ్, సర్పంచ్ జాక్క కవిత రాఘవేందర్ రెడ్డి ప్రారంభించారు. నమాతపల్లి గ్రామంలో పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ నల్ల మాస రమేష్ గౌడ్, సింగిల్‌విండో చైర్మెన్ నోముల పరమేశ్వర్ రెడ్డి , ఎంపీపీ నరాల నిర్మల వెంకట స్వామి యాదవ్‌తో కలిసి స్థానిక సర్పంచ్ ఏలముల శాలిని జంగయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని రైతు పండించిన ప్రతి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా,మండల కన్వీనర్లు కొలుపుల అమరేందర్, కంచి మల్లయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ జడల అమరేందర్ గౌడ్, మాజీ వైస్ చైర్మెన్ వెంకట్ గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు జనగాం పాండు, నీలా ఓం ప్రకాష్ గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ జిట్ట లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ అతికం లక్ష్మీనారాయణ, నాయకులు సబర్ కార్ వెంకటేష్, ఐకేపీ ఏపీఎం లింగయ్య యాదవ్ పాల్గొన్నారు.
మోటకొండూర్ : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పీఏసీఎస్ వైస్ చైర్మెన్ ఎగ్గిడి బాలయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ వడ్డెబోయిన శ్రీలత, ఎంపీపీ పైళ్ల ఇందిరాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తేమ, తాలు లేకుండా 17శాతం ఆరబెట్టిన దాన్ని తీసుకొచ్చి విక్రయించాలని కోరారు. ఏ గ్రేడ్ కు 1888, బీ గ్రేడ్ కు 1868 చెల్లించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రేగు శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారిని సుబ్బురు సుజాత, భూమండ్ల ఐలయ్య, డైరెక్టర్ అనంతుల జంగారెడ్డి, వార్డు సభ్యులు బీరకాయల మల్లేష్, జంగ వెళ్లి జహంగీర్, ఏఈవో ప్రణరు రెడ్డి, బల్ద సిద్ధులు పాల్గొన్నారు.