Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
ఏప్రిల్ 10,11 తేదీల్లో గుండాల మండలంలో జరిగే సీపీఐ(ఎం) జనచైతన్య పాదయాత్రను జయప్రదం చేయాలని పార్టీ మండల కార్యదర్శి మధ్దెపురం రాజు ప్రజలను కోరారు.శుక్రవారం మండల కేంద్రంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 10న వస్తా కొండూరు,నూనెగూడెం, గుండాల, గంగాపురం, మరిపడిగ గ్రామాల్లో పాదయాత్ర బందం ప్రజా సమస్యలను అధ్యయనం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గుండు వెంకట్ నర్సు,ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి నత్తి సతీష్,సోషల్ మీడియా మండల కార్యదర్శి విజరు రెడ్డి,సురేష్,వీరస్వామి,విశ్వతేజ తదితరులు పాల్గొన్నారు.
ఆలేరురూరల్ : యాదాద్రిభువనగిరి జిల్లా సమగ్రాభివృద్ధి కోసం సీపీఐ(ఎం) చేపట్టిన జనచైతన్య పాదయాత్ర ఈ నెల 11 ,12 ,13 తేదీలలో ఆలేరులో సాగనుందని ఆ పార్టీ మండల కార్యదర్శి. మోరిగాడి రమేష్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కార్మికులు, కర్షకులు ,విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు పాల్గొని పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు. మండలంలోని కొలనుపాక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానన్న మాట నీటి మూట లాగా మిగిలిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తీగల వెంకటేష్ ,మధ్య బోయిన ఉప్పలయ్య, బొమ్మకంటి లక్ష్మీనారాయణ ,గోల్కొండ గ్రామ శాఖ కార్యదర్శి సంగీ రాజు తదితరులు పాల్గొన్నారు.