Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నకిరేకల్: రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్మి మోస పోవొద్దని డీఆర్డీఏ పీడీ వై.శేఖర్‌రెడ్డి కోరారు. శనివారం మండలంలోని మంగళపల్లి, మర్రురు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రైతులు తాలు, చెత్తా చెదారం లేకుండా ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఎం మోహన్ రెడ్డి, ఏపీఎం ప్రభాకర్, నాయకులు గంగాధరరావు, సర్పంచులు నవీన్, వలిశెట్టి స్వప్న, సీసీ స్వరూప, ఎస్ఆర్పీ శాంత పాల్గొన్నారు.