Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
45 ఏండ్లు పైబడిన వారికి శనివారం మండలంలోని వనిపాకల గ్రామంలో కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి కిరణ్, గ్రామ సర్పంచ్ మేడి లింగమ్మనర్సింహ, ఉపసర్పంచ్ చాపల సతీష్, హెల్త్ ఎడ్యుకేటర్ నాగలక్ష్మీ ,హెల్త్ అసిస్టెంట్ సావిత్రి, బొడ్డుపల్లి శ్యామల, ఆశా కార్యకర్తలు నీరజ, లక్ష్మీ, విమల పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక ప్రభు త్వాస్పత్రిలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని శనివారం జెడ్పీ సీఈవో వీర బ్రహ్మచారి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 45 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ చేయించుకునేలా అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లాజర్, వైద్యాధికారి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.