Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగార్జునసాగర్
టీఆర్ఎస్ హయాంలోనే నందికొండ అభివద్ధి చెందిందని రాబోయే రోజులలో మరింత అభివద్ధి చెందుతుందని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దూదిమెట్ల బాలరాజు అన్నారు.మున్సిపాలిటీ పరిధిలోని పైలాన్ కాలనీలో ఇంటింటికీ తిరిగి సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు.అనంతరం మాట్లాడుతూ ఏండ్ల తరబడి అభివద్ధికి నోచుకోని ఈప్రాంతాన్ని టీఆర్ఎస్ హయాంలో నందికొండ మున్సిపాలిటీ ఏర్పాటుతో పాటు కమలానెహ్రూ హాస్పిటల్‌ను రూ.18కోట్లతో అభివద్ధి చేయడమే కాకుండా కొత్తగా తిరుమలగిరిసాగర్ మండలం ఏర్పాటు చేశారన్నారు.ప్రపంచమే అబ్బురపడేలా బుద్ధవనం నిర్మాణాన్ని చేపడుతున్నారన్నారు.అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజీ, బీసీ రెసిడెన్షియల్ కాలేజీ ఏర్పాటు చేశామన్నారు.సాగర్ నియోజకవర్గ సమగ్ర అభివద్ధి కోసం ఈనెల17న జరిగే ఉపఎన్నికల్లో తెరాస అభ్యర్థి నోముల భగత్‌కుమార్ కారుగుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఇందిరా,టీఆర్ఎస్కేవీ నాయకులు కొండల్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు చాంద్‌పాషా, నాయకులు రణధీర్‌గౌడ్, లక్ష్మణ్‌నాయక్, ఏడుకొండలు, సంతోష్, అంజయ్య, నజీర్, టీఆర్ఎస్వీ జిల్లా నాయకులు భద్రబోయిన సైదులు, నడ్డి సైదులు పాల్గొన్నారు.