Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగార్జునసాగర్
విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులు మరియు విద్యుత్ ఉద్యోగులు అధైర్య పడొద్దని విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారంలో టీఆర్ఎస్వీకేఎస్ యూనియన్ ముందుంటుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేవీ.జాన్సన్ అన్నారు.నాగార్జునసాగర్ పైలాన్‌కాలనీ జెన్కో గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన ఆ సంఘం జనరల్‌బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు.విద్యుత్ సంస్థలో ఉన్న సమస్యలను తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్‌ను కలిసి సమస్యలను ఆయన దష్టికి తీసుకెళ్లామన్నారు.మంత్రి స్పందించి సీఎండీ ప్రభాకర్‌రావుతో మాట్లాడి విద్యుత్ యూనియన్లతో సమావేశం నిర్వహించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పడంతో టీఆర్ఎస్ వీకేఎస్ యూనియన్ ఆధ్వర్యంలో గత ఫిబ్రవరి 6న విద్యుత్ సౌధలో విద్యుత్ యాజమాన్యాలతో జరిగిన చర్చలలో భాగంగా తదుపరి సమావేశం ఈ నెల 16 న శుక్రవారం మధ్యాహ్నం గం 03- 45 నిమి షాలకు విద్యుత్ సౌధలో ఏర్పాటు చేయడమైనదని తెలిపారు.16వ తేదీన విద్యుత్ యాజమాన్యంతో జరిగే సమావేశంలో ముఖ్యాంశాలను చర్చించేందుకు నాగార్జునసాగర్‌లో జనరల్‌బాడీ సమావేశం నిర్వహించామన్నారు.ఆర్టిజన్ కార్మికులు రెగ్యుల రైజేషన్ విషయంలో ఉన్న అనుమానాలను నివత్తి చేయడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ మన్నారు.విద్యుత్ కార్మికులకు ఈపీఎఫ్,జీపీఎఫ్‌ల విషయంలో కూడా చర్చించడం జరిగిందని ఆర్టిజన్ కార్మికులు కాకుండా ఉన్న కార్మికులందర్ని ఆర్టిజన్ కార్మికులుగా తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడూరి ప్రకాష్, వర్కింగ్ ప్రెసిడెంట్ రమేశ్, ఎస్పీడీసీఎల్ ప్రెసిడెంట్ యూసుబ్,కార్యదర్శి కరెంట్‌రావు, ట్రాన్స్‌కో కార్యదర్శి రాములు,అడిషనల్ సెక్రెటరీ నిరంజన్, సాగర్ జెన్కో అధ్యక్షులు కాంతయ్య, కార్యదర్శి చారి, మిర్యాలగూడ డివిజన్ నాయకులు పాల్గొన్నారు.