Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
ఎస్సీ కార్పోరేషన్ రుణాలను బ్యాంకులు ఎలాంటి షరతుల్లేకుండా ఇవ్వాలని మాదిగ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు నందిపాటి ప్రభాకర్ కోరారు. శనివారం మండల పరిషత్ కార్యాల యంలో వినతిపత్రం అంద జేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన అభ్యర్థులకు సకాలంలో రుణాలందించాలని, అర్హతను బట్టి వచ్చిన యూనిట్లు సక్రమంగా ఇవ్వాలని కోరారు.యూనిట్ల సంఖ్యను తగ్గించొద్దన్నారు.ఈ కార్యక్రమంలో పంగ నాగయ్య, పిట్ట నర్సయ్య, రవి, శ్రీను, జానయ్య పాల్గొన్నారు