Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
ప్రతి పోలీసు లైఫ్ సేవింగ్ స్కిల్స్ కలిగి ఉండాలని ఎస్పీ ఆర్.భాస్కరన్ సూచించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని పోలీసుస్టేషన్లలో పని చేస్తున్న బ్లూ కోట్స్, పెట్రోకార్ వర్టీకల్ ఫంక్షనల్ సిబ్బందికి విధుల నిర్వహణ, సమయపాలన,వనరుల ఉపయోగంపై ఎస్పీ ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డయల్ 100 కాల్‌పై త్వరగా స్పందించి బాధితులు, ఫిిర్యాదు దారులకు పోలీసు సేవలను వేగవంతంగా అందించడం బ్లూ కోట్స్ సిబ్బంది యొక్క ప్రాథమిక విధి అన్నారు.కొన్ని సమయాల్లో పోలీసు సహాయం కోరుతూ ఒక్కసారిగా ఎక్కువ డయల్ 100 కాల్స్ వస్తుంటాయని,ఇలాంటి సమయాల్లో బ్లూ కోట్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో పని చేసి,బాధితులకు మనోధైర్యం కల్పించాలని సూచించారు. అందు బాటులో ఉన్న వసతులను సద్వినియోగం చేసుకుని ప్రజలకు పోలీసు సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.పోలీసు సిబ్బంది బాధ్యతగా పారదర్శకంగా వ్యవహరిం చాలన్నారు.పెట్రోకార్ సిబ్బంది సంఘటనలపై వేగంగా స్పందించాలని,ప్రతి రోజు ప్రతి అనుమానిత ప్రాంతాన్ని క్షుణ్నంగా పరిశీలన చేయాలని పేర్కొన్నారు. పాత నేరస్థుల, షీటర్స్ యొక్క ప్రస్తుత జీవనశైలిని ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని,అందుకు డీఎస్పీ, సీఐలు నిత్యం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా బ్లూకోట్స్,పెట్రోకార్ విధుల నిర్వహణలో అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ట్యాబ్‌లను ఎస్పీ పోలీసు సిబ్బందికి అందజేశారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట డీిఎస్పీ మోహన్‌కుమార్, సీఐలు విఠల్‌రెడ్డి, ఆంజనేయులు, రాఘవరావు, శివరాంరెడ్డి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ నర్సింహ, ఆర్ఐలు నర్సింహారావు, గోవిందరావు, శ్రీనివాస్, ఐటీ కోర్ ఎస్సై రామారావు, బ్లూ కోట్స్ సిబ్బంది, పెట్రోకార్ సిబ్బంది పాల్గొన్నారు.