Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ బాల్క సుమన్
నవతెలంగాణ - పెద్దవూర
టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కంటికి కనిపించడం లేదా అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ జీవితంలో తాను ఏనాడూ ఒడిపోలేదని, కానీ రేవంత్‌రెడ్డి మాత్రం కొడంగల్‌లో ఓడి పోయారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో పోరాటాలు చేసిన కేసీఆర్‌ను విమర్శించే స్థాయి రేవంత్‌రెడ్డికి లేదన్నారు. నల్లగొండ జిల్లా ప్రజలు ఫ్లోరైడ్‌తో బాధపడుతుంటే రేవంత్‌రెడ్డి ఏనాడైనా కన్నెత్తి చూడలేదన్నారు. గల్లీలో, ఢిల్లీలో లేని మీ ప్రభుత్వం ఇక్కడ ఏం మాట్లాడినా చెల్లవన్నారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, ఎంపీపీ చెన్ను అనురాధ సుందర్‌రెడ్డి, జాతవత్ రవి, వాసుదేవుల సత్యనారాయణ, అబ్బాస్, బషీర్ తదితరులు పాల్గొన్నారు.