Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్.కష్ణయ్య
నవతెలంగాణ-హాలియా
బీసీలంతా ఐక్యతగా ఉండి సాగర్ ఉపఎన్నికల్లో భగత్‌ను గెలిపించాలని బీసీ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్.కష్ణయ్య కోరారు.శనివారం హాలియాలో బీసీ, ఎంబీసీ సంఘాల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మొత్తం 40 సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. నోముల నర్సింహయ్య చివరి శ్వాస వరకూ ప్రజల కోసం తపించారన్నారు.పేదల పెన్నిధి నర్సింహయ్య అన్నారు.సీఎం కేసీఆర్ గొప్ప మనస్సుతో నోముల వారసుడు భగత్‌కు టికెట్ ఇచ్చారన్నారు.బీసీ, ఎస్సీ, ఎస్టీలపై గురుతర బాధ్యత ఉందని, భగత్‌ను గెలిపించాలని కోరారు. భగత్ గెలుపు ఖాయమైందని జోస్యం చెప్పారు. భారీ మెజారిటీతో గెలుస్తాడన్నారు.బీసీల సత్తాను ఈ ఎన్నికల్లో చూపించాలన్నారు.సాగర్ నేల చాలా గొప్పదని, ఆచార్య నాగార్జునడు నడయాడిన నేల ఇది అన్నారు.ఇక్కడే మరోసారి చరిత్ర సష్టించాలని, భగత్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.సీఎం కేసీఆర్ అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, ఆసరా పథకాలు అద్భుతమైనవన్నారు.రైతులకు బాసటగా నిలుస్తున్నారని, వ్యవసాయాన్నిపండుగలా మార్చారన్నారు.ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణను అనుసరిస్తున్నాయని, దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు.సీఎం కేసీఆర్ బీసీలకు మద్దతుగా, బాసటగా నిలడ్డారన్నారు.భగత్ గెలుపుతో బీసీలకు మంచి రోజులు వస్తాయని, బీసీలకు రాజకీయాల్లో మంచి గుర్తింపు వస్తుందని చెప్పారు. ప్రలోభాలకు గురి కాకుండా, పార్టీలు, రాజకీయాల కతీతంగా బీసీలంతా భగత్‌కు ఓటేసి గెలిపించాలని కోరారు. నర్సింహయ్య అనేక మిలిటెంట్ పోరాటాలు చేశారని, నర్సింహయ్య జీవితాన్నే పోరాటంగా మల్చుకు న్నారన్నారు.నర్సింహయ్య ఉక్కు మనిషి అని, నర్సింహయ్య పేరు నిలబెట్టాలన్నారు. ఇది ఆత్మగౌరవ పోరాటమని, భగత్‌ను గెలిపించి చరిత్ర సష్టించాలన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.