Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ
నవతెలంగాణ-నాగార్జునసాగర్
ఆర్థిక సమస్యలతో ప్రైవేటు టీచర్ దంపతుల ఆత్మహత్యతో అనాథలైన ఇద్దరు చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం చెరో రూ.50 లక్షల చొప్పున రూ.కోటి ఎక్స్‌గ్రేషి యాను వెంటనే ప్రకటించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కష్ణమాదిగ అన్నారు. నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీపరిధిలోని హిల్‌కాలనీలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఆత్మహత్య చేసుకున్న ప్రైవేట్ టీచర్ దంపతుల కుటుంబానికి న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి ఆయన రాస్తారోకో నిర్వహించారు.అనంతరం మాట్లాడుతూ అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని ఆయన ప్రశ్నించారు.ఆంధ్రా రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్న జగన్‌లు ఆ రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు కల్పించడం వల్ల ఆత్మహత్యలు లేవన్నారు.తెలంగాణ రాష్ట్రంలో లక్షా 92 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నరని ఆరోపించారు.రవికుమార్ మతితోనైనా ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.టీిఆర్‌ఎస్ నాయకులకు ప్రచారానికి టైం ఉంటుంది గానీ ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి పరామర్శకు టైం ఉండదన్నారు. ఇది ఎంత దుర్మార్గమన్నారు.ఎమ్మార్పీఎస్ ప్రధాన డిమాండ్ అయినా తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం కింద రూ.8 వేలు ప్రకటించడం,ప్రైవేటు టీచర్లకు రూ.6 వేల ఆర్థిక సహాయం ప్రకటించడం, రవికుమార్ తల్లికి ప్రజలు ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం ప్రధానమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మోహన్‌రావు, రాంబాబు, జార్జి, వెంకటేశ్వర్లు, రవికుమార్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.