Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
కరోనా సెకండ్ వేవ్ దష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నతరుణంలో గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించిందని మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులెవరూ అధైర్యపడొద్దని కోరారు. అన్నదాతలు పండించిన చివరి ధాన్యం గింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన భరోసానిచ్చారు. మిర్యాలగూడ మండలంలోని వాటర్ ట్యాంకు తండా, భగ్య గోప సముద్రం తండాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. రైతులు తమ ధాన్యాన్నికొనుగోలు కేంద్రాలకు తెచ్చే ముందు తేమ శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. రైతులు తప్పనిసరిగా ధాన్యం తేమ శాతం 18 లేదా అంతకంటే తక్కువగా ఉన్నప్పుడే వరికోత యంత్రాల ద్వారా ధాన్యాన్నికోయించి వేరు చేయాలని సూచించారు. తాలు, తప్ప, తర్రా లేని నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లి మద్దతు ధర పొందాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు శంకర్‌నాయక్, రాంచంద్రునాయక్, ఎంపీటీసీ వీటీనాయక్, ఏఎంసీ డైరెక్టర్ పులి జగదీశ్, టీఆర్ఎస్ నాయకులు మట్టపల్లి సైదులు యాదవ్, జట్టి లింగయ్య యాదవ్, ఐకేపీ సిబ్బంది కష్ణమూర్తి, వినీల, తదితరులు పాల్గొన్నారు.