Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హాలియా
సాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కే తమ మద్దతు ప్రకటిస్తున్నట్టు నార్మాక్స్ చైర్మెన్ గుత్తా జితేందర్‌రెడ్డి తెలిపారు.శనివారం నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘ ం యూనియన్ హాలియా పాలశీతలీకరణ కేంద్రం పరిధిలోని నిడమనూరు మండలం బంఖాపురం గ్రామంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాల ఉత్పత్తిదారుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ కషి చేస్తున్నారన్నారు.పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడుతుందన్నారు.ఉపఎన్నికల్లో భగత్‌కే పాలఉత్పత్తి దారులు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ శోభ సత్యనారాయణ, యూనియన్ గౌరవాధ్యక్షులు కర్నాటి ఉప్పల్‌రెడ్డి, నార్మాక్స్ యూనియన్ మాజీ డైరెక్టర్ ఉన్నం శ్రీనివాసరావు, రాయపాటి పేరయ్య, బాలకష్ణ, పాల సంఘాల అధ్యక్షులు వెంకటేశ్వర్రావు, లక్ష్మయ్య, రాంకోటి, శంకర్, సైదయ్య, కష్ణయ్య, నాగయ్య, చిన్నపెద్దయ్య, రాములు పాల్గొన్నారు.