Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-తిరుమలగిరిసాగర్
సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిసి రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రావడం ఖాయమని ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు.శనివారం ఉపఎన్నికల్లో భాగంగా మండల కేంద్రంలో జరిగిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. నియో జకవర్గంలో అభివద్ధిని చూసి ఓటమి భయంతో డబ్బు సంచులతో వచ్చారన్నారు.సీఎం కేసీఆర్ మోచేతి నిల్లుతాగే సన్యాసులకు జానారెడ్డి చేసిన అభివద్ధి కన్పించడం లేదా అని ప్రశ్నించారు.లక్ష ఉద్యోగాలు, నిరుద్యోగ భతి,ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి తమ కుటుంబంలో ఐదుగురికి ఉద్యోగాలు కల్పించుకున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పు తెలంగాణ చేశారని మండిపడ్డారు.ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు రోడ్డున పడ్డారని,ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని ఆవేదన చెందారు. కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్నారు.కానీ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు వేలాది ఎకరాల పోడుభూములు ఇచ్చిందనని గుర్తు చేశారు.జానారెడ్డి తనకు ముఖ్యమంత్రి పదవి వద్దు..విద్యార్థులు ఆత్మబలి దానాలు ఆపడానికి తెలంగాణ కావాలని పట్టుబడితే సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వబట్టే నూతన రాష్ట్రం ఏర్పాటైందన్నారు.ప్రతి గ్రామానికి బీటీ, సీసీరోడ్లు వేసిన ఘనత కూడా జానారెడ్డికే దక్కిందన్నారు.అభివద్ధి ప్రదాత జానారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి బలరాంనాయక్, అభ్యర్థి కుందూరు జానారెడ్డి కుందూరు జయవీర్‌రెడ్డి, గడ్డం సాగర్‌రెడ్డి, శాగం పెద్దిరెడ్డి, చంద్రశేఖర్, బద్దెల వెంకన్న, కె.నగేష్, షేక్ సుబాన్, శ్రీధర్‌రెడ్డి, బాలునాయక్,మంగ్తానాయక్, పాండునాయక్, అనుముల సాలయ్య, అంజి పాల్గొన్నారు.