Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి
నవతెలంగాణ - నల్లగొండ
సాగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే నాగార్జునసాగర్ డ్యామ్ మరో ఎడారిగా మారుతుందన్నారు. ఉపఎన్నికల్లో అధికార పక్ష నాయకులు అడ్డగోలుగా అనుమతు లు లేకుండా ప్రచార కార్యక్రమాల్లో వాహనాలు నడిపిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్యం, డబ్బులతో గెలవాలని యత్నిస్తుం దన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, ఎస్సీ సెల్ నాయకులు మహేశ్వర్రాజు తదితరులు పాల్గొన్నారు.