Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు ఫూలేనని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేశ్ అన్నారు. పూలే జయంతి సందర్భంగా స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు డాక్టర్ మల్లు గౌతమ్‌రెడ్డి, రవినాయక్, రాంరెడ్డి, బొంగరాల వెంకటయ్య, బ్రహ్మచారి పాల్గొన్నారు.
బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని ఫూలే విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు పగిడి జీడయ్యయాదవ్,రాష్ట్ర అధ్యక్షులు తాళ్లపల్లి రవి, తాళ్లపల్లి సురేశ్, చిమట శంకర్, ధీరావత్ హరినాయక్, లావూరి జగన్, సైదులు, పెరుమాళ్ల ధనమ్మ, అంగరాజు, స్వర్ణలత పాల్గొన్నారు.
విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఫూలే విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షులు శిరసనగండ్ల ఈశ్వరాచారి, చిల్లాపురం వార్డు మెంబర్ పెదయ్యచారి, నాయకులు శ్రీనివాసచారి, నాగేంద్రచారి, రమేశ్‌చారి, నాగాచారి, లక్ష్మయ్యచారి పాల్గొన్నారు.
అదేవిధంగా టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాసుల సత్యం ఫూలే చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంటు టీఎన్టీయూసీ అధ్యక్షులు ముక్కెర అంజిబాబుయాదవ్, మైనార్టీ సెల్ పార్లమెంటు అధ్యక్షులు ఎమ్‌డి.జానిమియా, ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి నూకపంగ కాశయ్య, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గంధం శ్రీనివాస్, వాణిజ్య సెల్ అధ్యక్షులు ఏచూరి అనంతరాములు, టీఎన్టీయూసీ నాయకులు పొనుగోటి వెంకటేశ్వర్రావు, సీనియర్ నాయకులు నానక్‌సింగ్ పాల్గొన్నారు.
సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని, ఆశయ సాధనే అసలైన నివాళి అని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. స్థానికంగా ఆయన విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు డబ్బికార్ మల్లేశ్, మారం శ్రీనివాస్, సైదులు గంగపుత్ర, నల్లమేకల వెంకయ్య, గుడిపాటి కోటయ్య, తాళ్లపల్లి రవి, అశోక్, పోగుల సైదులు, కోల సైదులు, రెమడాల పరుశురాములు, పత్తిపాటి నవాబ్ పాల్గొన్నారు.
ఫూలే సేవలు చిరస్మరణీయమని మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ అన్నారు. ఫూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు కేతావత్ శంకర్‌నాయక్, కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, పార్టీ పట్టణాధ్యక్షులు నూకల వేణుగోపాల్‌రెడ్డి, కౌన్సిలర్లు గంధం రామకష్ణ, కొమ్ము శ్రీనివాస్, నాయకులు పొదిల శ్రీనివాస్ పాల్గొన్నారు.
విద్యయే ప్రగతికి మూలమని ఎంఈఓ బాలాజీనాయక్ అన్నారు.స్థానిక ఎంఆర్సీలో పూలే చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎంలు ఎల్.వెంకన్న, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్, అనిత, వెంకట్, పీఆర్టీయూ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గుడిపాటి కోటయ్య, బీసీటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లమేకల వెంకయ్య, సైదిరెడ్డి, వెంకటేశ్వర్లు, సీఆర్పీ నాగేందర్, డేవిడ్, నర్సయ్య, బాలయ్య పాల్గొన్నారు.
నాంపల్లి : మండలకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో మహనీయుల మిత్రమండలి ఆధ్వర్యంలో ఫూలే 195 వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మహనీయులమిత్రమండలి నిర్వాహకులు నాంపల్లి చంద్రమౌళి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, అంబేద్కర్ యువ కేంద్రం రాష్ట్ర అధ్యక్షుడు గాలెంక గురుపాదం, అడ్వకేట్ కోరే కిషన్‌రావు ,వార్డు సభ్యులు గాదెపాక వేలాద్రి, గ్రామపంచాయతీ కో ఆప్షన్ సభ్యులు నాంపల్లి నారయ్య, కోట రఘునందన్,వీఆర్ఏల సంఘం మండల కార్యదర్శి కోరే యాదగిరి, దాసరి కిషన్, ఏదుళ్ళ రాములు, గాదెపాక రాజు, ఏదుళ్ళ పృద్వీ, నాంపల్లి గిరిబాబు, రజినీకాంత్, మధు పాల్గొన్నారు.
మర్రిగూడ: బడుగు, బలహీన వర్గాల జీవితాలల్లో వెలుగులు నింపిన సంఘసంస్కర్త, కవి, రచయిత, విమర్శకులు మహాత్మాజ్యోతిరావుఫూలే జయంతి వేడుకలను ఎంపీడీఓ కార్యాలయంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమేశ్దీనదయాల్, ఎంపీఓ ఝాన్సీ, బీజేపీ మండల అధ్యక్షులు చెరుకు శ్రీరాములుగౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర మీడియా సెల్ కన్వీనర్ పిట్టల శ్రీనివాస్, మండల అధ్యక్షుడు కుక్కల వెంకటేష్, రఘు, నర్రా పరమేష్, గ్యార గోపాల్, వెంకటంపేట నర్సింహ, కొడిచర్ల రవి, శ్రీరామ్ పాల్గొన్నారు.
దేవరకొండ : భారతదేశ సామాజిక అసమానతలపై జీవితాంతం పోరాటం చేసిన మహోన్నత పోరాటయోధుడు మహాత్మ జ్యోతిరావుఫూలేలేనని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహారెడ్డి, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్యనాయక్ అన్నారు.ఫూలే జయంతి సందర్భంగా సీపీఐ ప్రజాభవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి,సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బొడ్డుపల్లి వెంకటరమణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎండి మైనోద్దీన్, మండల కార్యదర్శులు పార్లపల్లి కేశవరెడ్డి ,తూం బుచ్చిరెడ్డి, ఉప్పునూతల వెంకటయ్య, పోలె వెంకటయ్య, కుంభం జయరాములు, ప్రజా సంఘాల నాయకులు నూనె రామస్వామి, నూనె వెంకటేశ్వర్లు, వలమల్ల ఆంజనేయులు, దేపా సుదర్శన్ రెడ్డి, అలమోని మల్లయ్య, నగేష్ పాల్గొన్నారు.
బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పూలే జయంతి నిర్వహంచారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ అధ్యక్షులు చింతపల్లి శ్రీనివాస్‌గౌడ్, సంఘం దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు తోటపల్లి మల్లేష్, నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ సురకారపు సత్యం, యువజన సంఘం నాయకులు కడారి తిరుపతయ్య, మధు, రమేశ్ పాల్గొన్నారు.
ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో కార్యాలయంలో పూలే జయంతి సందర్భంగా ఆర్డీవో గోపిరాం ఫూలే చిత్రపటానికి పూలమాలలే నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
బీసీటీయూ ఆధ్వర్యంలో..బీసీటీయూ దేవరకొండ డివిజన్ అధ్యక్షుడు పిల్లుట్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఫూలే వేడుకలు నిర్వహించారు.ఈ వేడుకల్లో రాసాల వెంకటయ్య, పెనుగొండ శేఖర్, కర్నాటి పండర్నాథ్, చంద్రశేఖర్, వెంకటయ్య, శ్రీరాములు, లక్ష్మయ్య, శేఖర్, మురళి తదితరులు పాల్గొన్నారు.
నాగార్జునసాగర్ : పైలాన్‌కాలనీలో 1535 విద్యుత్ వర్కర్స్ యూనియన్ సాగర్ అధ్యక్షుడు లవకుమార్ ఆధ్వర్యంలో ఫూలే జయంతి నిర్వహించారు.ఈ కెవి,మజర్, జెన్కో ఉద్యోగులు, యూనియన్ నాయకులు ఉన్నారు.