Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతపల్లి
కోవిడ్ వ్యాక్సిన్‌పై అపోహలొద్దని, 45 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ టీకా వేయింకోవాలని జిల్లా మహిళా శిశుసంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మెన్,జెడ్పీటీసీ కంకణాల ప్రవీణ వెంకట్‌రెడ్డి కోరారు.ఆదివారం మండలంలోని మాల్ వెంకటేశ్వర్నగర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కంకణాల ప్రవీణ వెంకట్‌రెడ్డి దంపతులు వ్యాక్సిన్ మొదటి డోస్ వేయించుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్-19పై పోరులో మన హైదరాబాద్‌కు చెందిన వైద్యులు, శాస్త్రవేత్తలు చేసిన కషి చాలా గొప్పదన్నారు. అర్హులందరూ ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలని పిలుపునిచ్చారు.ప్రాథమిక వైద్యశాలకు ప్రహారీగోడ నిర్మాణం కోసం ఎమ్మెల్యే రవీంద్రకుమార్ దష్టికి తీసుకెళ్ళి నిధులు మంజూరు చేయిస్తానన్నారు.ఆమె వెంట డాక్టర్ శ్రీదేవి, ఎంపీడీఓ రాజు, టీఆర్ఎస్ నాయకులు పూల యాదయ్య, మాజీ సర్పంచ్ నాదిరి రమేశ్, ఉప్పు శేఖర్, గడ్డం శేఖర్ పాల్గొన్నారు.