Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
అనారోగ్యంతో బాధపడుతూ ఆర్దికంగా ఇబ్బంది పడుతున్నపట్టణానికి చెందిన ముత్యాల సంధ్యకు సిలికాన్ ద్రోణా పర్సనలైజ్డ్ ఆన్లైన్ ట్యూటరింగ్ విద్యాసంస్థ వారు ఆదివారం రూ.25 వేలు ఆర్థికసాయం అందజేశారు.ఆ సంస్థ చైర్మెన్ హరిరెడ్డి ఆధ్వర్యంలో సంస్థ ప్రతినిధులు కంకణాల ప్రభాకర్‌రెడ్డి, చిలుకోటి మధుసూదన్‌రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ కంచరకుంట్ల దయాకర్‌రెడ్డిలు సంధ్యకు అందజేశారు.ఈ సందర్భంగా దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు ఆమెకు రూ.1,00,500 అందించామన్నారు. సామాజిక మాధ్యమం ద్వారా ఇచ్చిన పిలుపుతో స్పందించిన దాతలకు కతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పీషాటి పుల్లారెడ్డి, కంచరకుంట్ల నవీన్‌రెడ్డి, కె.సంపత్‌రెడ్డి పాల్గొన్నారు.