Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
3 వేల ఏండ్ల మనువాదానికి 70 సంవత్సరాల భారతరాజ్యంగానికి అంతర్యుద్ధం జరుగుతుందని జ్యోతిరావుపూలే ఆనాడే పసిగట్టి పోరాడిన గొప్ప మానవతావాది అని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున అన్నారు. ఆదివారం దొడ్డికొమరయ్య భవన్లో కెవిపిఎస్ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావుపూలే జయంతిని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అధర్మాన్ని వ్యతిరేకించడం సత్యాన్ని శోధించడం ఆయన అలవాటన్నారు. బానిసత్వం నుంచి విముక్తి కావాలని, ఆధిపత్యం అంతం కావాలని ఆయన గులాంగిరి అనే పుస్తకాన్ని రచించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, బండ శ్రీశైలం, ఎండి.సలీం, కల్లు గీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు కొండా వెంకన్న, కేవీపీఎస్ పట్టణ కార్యదర్శి గాదె నర్సింహ, నాయకులు దండేపల్లి సత్తయ్య కోట్ల అశోక్ రెడ్డి, సతీష్, ఉప్పులా గోపాల్ , పెరిక కష్ణా కందుల అశోక్ ,నర్సింహా, రంజిత్‌కుమార్ పాల్గొన్నారు.
అదేవిధంగా అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతి బాపూలే అని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు అన్నారు.అది వారం నల్లగొండ లో స్థానిక పెద్ద గడియారం సెంటర్ వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చక్రహరి రామరాజు మాట్లాడుతూ ప్రతి ఏటా మహత్మ ఫూలే జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేది కానీ ఈ సంవత్సరం ఎన్నికల కోడ్ వల్ల నిర్వహించలేదన్నారు.అందుకే బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు కంది సూర్య నారాయణ సీనియర్ ఉపాధ్యక్షులు కాసోజు విశ్వనాథం,కోశాధికారి నల్ల సోమా మల్లయ్య, నేలపట్ల సత్యనారాయణ జవ్వాజి ఇంద్రయ్య జిల్లా ఉపాధ్యక్షులు కేషబోయిన శంకర్ ముదిరాజ్, సిరి పోలు వెంకట పతి పోలోజు యాదయ్య సుంకరి మల్లేష్ గౌడ్, పీఏసీఎస్ చైర్మెన్ బొర్రా సుధాకర్, కె.పర్వతాలు సీతారాములు బలిజ కోటప్ప నాగరాజు, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా కన్వీనర్ రాపోలు పరమేష్, కో కన్వీనర్ వాడ పల్లి సాయిబాబ, పిట్టల రామ కష్ణ, యువ జన సంఘం జిల్లా అధ్యక్షుడు చోల్లేటి రమేష్,అరవింద్, బీజేపీ శ్రీనివాస్ గౌడ్, సీపీఐ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా నల్లగొండ గడియారం కేంద్రంలో పూలే విగ్రహానికి తెలంగాణ జన సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాట్లాడుతూ అనగారిన వర్గాల అభ్యున్నతికి కషి చేసిన మహనీయుడు బడుగు వర్గాల హక్కుల కోసం ఈ కార్యక్రమంలో టీజేఏసీ నాయకులు %రష్ట్రఱఙa%, కిరణ్ ధీరావత్ వీర నాయక్ పాల్గొన్నారు.
తెలంగాణ ఇంటి పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతినిఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం విభాగం అధ్యక్షులు సందీప్బిచమర్ విధ్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు కొండేటి మురళీధర్, నాయకులు కత్తుల చందన్ పట్టణ అద్యక్షులు కత్తుల దినేష్ పాల్గొన్నారు.
చిట్యాల : అణగారిన వర్గాల ప్రజల, స్త్రీ విముక్తి కోసంఅహర్నిశలు పాటు బడిన మహానుభావుడు మహాత్మా జ్యోతి రావు పూలే అని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జిట్ట నగేష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో జ్యోతిరావుపూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పామనుగుల్ల అచ్చాలు, ఆ సంఘం మండల కార్యదర్శి బడే అజరు కుమార్, నాయకులు పంది నరేష్, వివిధ ప్రజా సంఘాల నాయకులు నారబోయన శ్రీనివాసులు, శీలా రాజయ్య, రుద్రారపు పెద్దులు, జోగు లక్ష్మయ్య, అక్కనపల్లి నాగయ్య,మద్ది లింగయ్య, యల్లం వీరయ్య, బోడ శీను, కొనేటి యాదయ్య, జిట్ట రమేష్, హరీష్,బాల నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ కార్యాలయంలో మహాత్మా జ్యోతి రావు పూలే చిత్రపటానికి వైస్ చైర్మెన్ కూరెల్ల లింగస్వామి, కమిషనర్ రామ దుర్గా రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కౌన్సిలర్లు, బెల్లి సత్తయ్య , కోనేటి కష్ణ, సిలివేరు మౌనిక శేఖర్, నాయకులు దాసరి నర్సింహ , షరీఫ్ పాల్గొన్నారు.
చండూరు : మండలంలోని గట్టుప్పల్ గ్రామంలో మహాత్మా జ్యోతిభా పూలే చిత్రపటానికి బీసీ,ఎస్సీ, ఎస్టీ,మైనారిటీ కుల సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుమారి యిడం రోజా, బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు పున్న కిషోర్, ఘట్టుప్పల మండల సాధన సమితి కన్వీనర్ యిడం కైలాసం,పెద్దగోని రాఘవేంద్ర, వివిధ కుల సంఘాల నాయకులు మాదగాని సత్తయ్య,కర్నాటి అబ్బయ్య, చెరిపల్లి కష్ణ, చిలుకూరు ఆంజనేయులు,బవాండ్ల శ్రీనివాస్,మహిళా నాయకురాలు కర్నాటి ప్రమీల,చిలివేరు వెంకటేశం,కుండే సత్యనారాయణ, పగిళ్ళ వెంకటేశం, నల్లవెళ్లి స్వామి,ఎండీ ఆరిఫ్, అబ్బాస్,ఖమ్మం చంద్రయ్య, కానుకుర్తి స్వామి, పవడాల యాదయ్య,బాణవత్ బూరు నాయక్, వరికుప్పల నర్సింహ,పగిళ్ళ హనుమంతు, మహేశ్ ,బీమగాని కోటయ్య, వెంకటేశం, కర్నాటి రవితేజ,మాదగాని సందీప్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు అన్నెపర్తి యాదగిరి జ్యోతిరావుపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ గుంటి వెంకటేశం, జిల్లా నాయకులు సముద్రాల వెంకన్న , మహిళా మోర్చా జిల్లా ప్రధానకార్యదర్శి సముద్రాల ఉమారాణి, భూతరాజు దేవదాసు, మోర్చాల జిల్లా కార్యదర్శులు ఇరిగి ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్ :మహాత్మ జ్యోతిబాపూలే జయంతి పురస్కరించుకుని సీపీఐ(ఎం)ఆధ్వర్యంలో స్థానిక రాఘవరెడ్డి భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందాల ప్రమీల, కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు పనికిరా కష్ణ మోహిని, నాయకులు వంట పాక వెంకటేశ్వర్లు, ఒంటె పాక కష్ణ, రావిరాల మల్లయ్య, పుట్ట సత్తయ్య పాల్గొన్నారు.
సమసమాజ స్థాపనలో భావితరాలకు స్ఫూర్తి మహాత్మ జ్యోతిబాపూలే అని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. ఆదివారం జ్యోతిబా పూలే జయంతి వేడుకలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నడికుడి ఉమారాణి వెంకటేశ్వర్లు ,నాయకులు పాల్గొన్నారు.
నల్లగొండ కలెక్టరేట్ : యూటీిఎఫ్ జిల్లా కార్యాలయంలో మహాత్మ జ్యోతిబాపూలే జయంతిని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జ్యోతిబాపూలే సమాజంలో వెనుకబడిన వర్గాల అభివద్ధి కోసం పాటుపడ్డాడన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎడ్ల సైదులు పెరుమాళ్ళ వెంకటేశం కోశాధికారి శేఖర్ రెడ్డి జిల్లా కార్యదర్శులు రాజశేఖర్, మురళయ్య,గేర నరసింహ మహిళా విభాగం కన్వీనర్ మమత క్రీడా కన్వీనర్ మాణిక్యం ,మండల బాధ్యులు వీరాచారి ,సైదులు, భాను ప్రకాష్ కష్ణ పాల్గొన్నారు.