Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెరువుగట్టు దేవస్థానంచైర్మెన్ మేకల అరుణ రాజిరెడ్డి
నార్కట్పల్లి :శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయం చెరువు గట్టుకు వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పన లక్ష్యంగా పని చేస్తున్నట్టు ఆలయ చైర్మెన్్ మేకల అరుణ రాజి రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం దేవస్థానంలో మౌలిక వసతులు ఏర్పాటుకోసం దాతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు . గట్టుపైన కార్యాలయం ముందు భాగంలో షెడ్డు నిర్మాణం చేపట్టుటకు కూతురు లక్ష్మారెడ్డి-సత్యవతి దంపతులు రూ. 4,00,000 విరాళం ప్రకటించారు. ఈ సమావేశంలో దేవస్థాన కార్యనిర్వహణాధిరి అన్నెపర్తి సులోచన, చెర్వుగట్టు ఎంపీటీసీ మేకల రాజిరెడ్డి గారు, దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు బూరుగు కష్ణయ్య, కొండేటి వేణు, మారుపాకల ప్రభాకర్ రెడ్డి, కంకల యాదయ్య, పసునూరి శ్రీనివాస్, చిక్కుళ్ల యాదగిరి, కల్లూరి శ్రీను, దండు శంకరయ్య, బొబ్బలి దేవేందర్, మేక వెంకట్ రెడ్డి, ఎక్స్-అఫిషియో , ప్రధానార్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ , సిబ్బంది పాల్గొన్నారు.