Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
సమాజసేవలో యువత ముందుండాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జె.నర్సింహారావు అన్నారు. డీవైఎఫ్ఐ మండల కమిటీ, భగత్‌సింగ్ యూత్ గడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో మండలంలోని గడ్డిపల్లి గ్రామంలో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎదురుగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు.వేసవికాలంలో ఇలాంటి చలివేంద్రాల ద్వారా ఎంతో మంది బాటసారులకు, బ్యాంకుకి వచ్చిన వారికి దాహం తీర్చుటకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. యువత సమాజానికి ఉపయోగపడే ఎన్నోసామాజిక కార్యక్రమాలు చేయాలన్నారు. యువత అన్నిరంగాల్లో రాణించాలని, విద్య, ఉపాధి హక్కుల కోసం పోరాటాలు నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల నాయకులు మేకల శోభన్, ఎస్బీఐ గడ్డిపల్లి బ్రాంచి మేనేజర్ బాపూజీ, డీవైఎఫ్ఐ మండల కార్యదర్శి బోయిల్ల నవీన్, గడ్డిపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు సతీష్, కొలిపాక వంశీకష్ణ పాల్గొన్నారు.