Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
హుజూర్నగర్ కోట్లు మేజిస్ట్రేట్ జూనియర్ సివిల్ జడ్జి తేజ చక్రవర్తిఆధ్వర్యంలో శనివారం కోర్టు ఆవరణలో నిర్వహించిన మెగా లోక్అదాలత్ 82 క్రిమినల్, నాలుగు సివిల్ కేసులు పరిష్కారమయ్యాయి. ఈ సందర్భంగా జడ్జి కక్షిదారులనుఉద్దేశించి మాట్లాడుతూ లోక్అదాలత్ ద్వారా డబ్బు, సమయం వృథా కాదన్నారు.కక్షిదారులు శాంతి యుత వాతావరణంలో రాజీపడి కేసులు పరిష్కరించు కోవచ్చన్నారు.రాజీమార్గమే రాజమార్గమన్నారు.అహింసా పద్ధతిలో కేసులు పరిష్కారం చేసుకోవడం మంచిదన్నరు లోక్ అదాలత్లో పరిష్కరించబడిన కేసులు హైకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి అవకాశం లేదన్నారు.ఈ కార్య క్రమములో సీఐ రాఘవరావు, ఏజీపీలు అంబటి శ్రీని వాస్రెడ్డి, ఉప్పల గోపాలకష్ణమూర్తి, జక్కుల నాగేశ్వరరావు, కె.నర్సిం హారావు,సత్యనారాయణ, కాల్వ శ్రీనివాసరావు, మీసాల అంజయ్య, కష్ణయ్య, యాదగిరి, ప్రవీణ్, అంజయ్య, ఎస్కె.లతీఫ్ ,చంద్రయ్య, సురేష్, పి.వెంకట్రెడ్డి, నారాయణరెడ్డి, ప్రదీప్తి, ఎస్సైలు వెంకటరెడ్డి, విష్ణు, వెంకన్న, యాదవేంద్రరెడ్డి, కోర్టు సిబ్బంది సుశీల పాల్గొన్నారు.