Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అష్టకష్టాలతో ఆఖరి మజిలీ
- హిందూ శ్మశానవాటికలో అంతిమ దహనసంస్కారాల్లో పాల్గొని మాన వత్వాన్నిచాటుకున్న యువత
నవతెలంగాణ-మిర్యాలగూడ
పట్టణంలోని ఇస్లాంపుర కాలనీకి చెందిన కొంతమంది ముస్లిం యువకులు మానవత్వానికి ప్రతీకగా నిలిచి సర్వమత సౌభ్రాత్రుత్వాన్ని చాటారు.వివరాల్లోకి వెళ్లితే...ఇస్లాంపుర కాలనీకి చెందిన లక్ష్మమ్మ కుమారుడు చంద్రశేఖరాచారి(55) అనారోగ్యంతో మతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ రెండో వేవ్ కొనసాగు తున్ననేపథ్యంలో సమీప బంధుమిత్రులెవరూ చారి భౌతిక కాయాన్ని కడసారి చూసేందుకు రాలేదు. లక్ష్మమ్మ కుమారుడు చంద్రశేఖరాచారి వత్తిరీత్యా వడ్రంగి పనిచేసే వాడు.చారి పాడెను ఎత్తుటకు సమీప బంధువులెవరూ ముందుకు రాకపోవడంతో ముస్లిం యువకులు ఆ బాధ్యతను తమ భుజస్కందాలపై వేసుకున్నారు.చారి ఆఖరి మజిలీని గౌరవప్రదంగా నిర్వహించేందుకు వారు సర్వశక్తులను ఒడ్డారు. మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, సామాజికవేత్త బీఎల్ఆర్ వైకుంఠ రథయాత్ర ఉచిత వాహన సేవల కోసం ముందస్తుగా 8282826666 సెల్ నెంబర్కు సమాచారం అందజేశారు.అనంతరం అదే వాహనంలో తాళ్లగడ్డలోని శ్మశావాటికకు చేరుకున్నారు. హిందూ ధర్మ సంప్రదాయం ప్రకారం చారి అంతమసంస్కరాల్లో ముస్లిం యువకులు పాల్గొన్నారు.చారి అంతిమ సంస్కారాల్లో నాయబ్, ఖురాన్, నసీర్బాబా, వసీం, ఖయ్యుమ్, జుబేర్ పాల్గొన్నారు.