Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన వద్ధుడు
- కుదుటపడ్డాక ఇంటికి తీసుకుపోని కుటుంబసభ్యులు
నవతెలంగాణ-సూర్యాపేట
ఆయన ఓ వద్ధుడు.ఆయనకు అందరూ ఉన్నారు.కానీ అనాధ గానే ఉంటున్నాడు.ఒకప్పుడు ఎంతో పేరు ప్రఖ్యాతులతో జీవనం కొనసాగించిన వ్యక్తి, నేడు కొందరి సహాయంతో జీవనం గడపాల్సి వచ్చింది.పూర్తి వివరాలు తెలుసుకుంటే సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అలంకార్ టాకీస్ సెంటర్ లో ప్రింటింగ్ ప్రెస్లో ఎంతో పేరుగాంచిన పోలా కిషన్ అనాథగా మా రాడు.ఇతనికి భార్య,ఇద్దరు కుమారులు,ఒక కుమార్తె ఉన్నారు.అందరికి వివాహాలు జరిపించాడు.ఆస్తులు కూడా రాసి ఇచ్చాడు.ఇటీవలే ఆయన అనారోగ్యానికి గురికావడంతో సూర్యాపేట జనరల్ ఆస్పత్రిలో చేరాడు.ఆరోగ్యం కుదట పడిన అనంతరం వైద్య సిబ్బంది పంపించారు.కానీ ఇంటి దగ్గర ఉన్న పరిస్థితులతో ఇంటికి వెళ్లలేక ఆస్పత్రిలో ఉండలేక చెట్ల కింద కాలం వెళ్లదీస్తు న్నారు.అయినప్పటికీ ఆయనను కుమారులు,కూతురు,భార్య తీసుకుపోయే పరిస్థితి లేదు.ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ప్రస్తుతం ఆయన లేడు పిల్లల్ని కని,చదివించి,పెద్ద చేసి ఆస్తులు రాసిచ్చి చివరికి దీన స్థితిలో గడపాల్సి వస్తుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని పలువురు పేర్కొంటున్నారు.అధికారులు స్పందించి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.