Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డ్డి
నవతెలంగాణ-పెద్దవూర
రాష్ట్రంలో ఇంటికొక ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ తన ఇంట్లో అందరికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారని, నిరుద్యోగులు మాత్రం ఉద్యోగాల్లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.ఆదివారం ఉపఎన్నికల్లో భాగంగా మండలంలోని చలకుర్తి, తుమ్మచెట్టు, పెద్దవూర, వెలమగూడెం పెద్డగూడెం గ్రామాల్లో ఆయన మాట్లాడారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను రూ. 4లక్షల కోట్లు అప్పులపాలు చేశారన్నారు.నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు,రుణమాఫీ లేదు,డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లేవు,మూడెకరాల భూమి లేదు,గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లులేవని విమర్శించారు. సునీల్‌నాయక్,సాగర్‌లో రవికుమార్ ఆత్మ హత్యలకు కేసీఆరే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. జానారెడ్డి నియోజకవర్గంలో 35 వేల ఇందిరమ్మఇండ్లు,1000 కి.మీ మేర బీటీరోడ్లు, లింకు రోడ్లు,విద్యుత్,తాగునీళ్లు ఇచ్చిన ఘనత జానారెడ్డికే దక్కిందన్నారు.పెద్దవూర మండలకేంద్రంలో రూ. 4కోట్లతో సబ్ మార్కెట్ యార్డు, రూ.2.80 కోట్లతో శుద్ధిజలాలు అందిస్తున్నారన్నారు.రూ.1.80కోట్లతో పెద్దవాగుపై బ్రిడ్జి, నవోదయ విద్యాలయం, సిరసనగండ్ల, చిన్నగూడెం, దొక్కలబాయి వాగులపై బ్రిడ్జిలు జానారెడ్డి నిర్మించలేదా అని ప్రశ్నించారు.ఇలా చెప్పుకుంటూ పోతే జానారెడ్డి చేసిన అభివద్ధి పనులు రామాయణంతా ఉందన్నారు.జానారెడ్డి అభివద్ధిపనులపై సాగర్ డ్యామ్‌పై నేను చర్చకు కేసీఆర్ వస్తావా..అని సవాల్ విసిరారు.సోనియాగాంధీ నీకు తెలంగాణ కావాలా..సీఎం పదవి కావాలా..అంటే నాకు తెలంగాణ కావాలని కోరుకున్నారన్నారు. అలాంటి జానారెడ్డిని విమర్శించే స్థాయి జగదీశ్‌రెడ్డికి లేదన్నారు.దుబ్బాకలో ఒక్కసారి కూడా కన్నెత్తి చూడని కేసిఆర్ ఓటమి భయంతోనే రెండోసారి బహిరంగసభ నిర్వహిస్తు న్నామన్నారు.జానారెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని జోస్యం చెప్పారు.కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి మాట్లాడుతూ తాను చేసిన అభివద్ధి అంతా నియోజకవర్గ ప్రజలు తెలుసని..వాళ్ళు నన్ను ఆశీర్వదిస్తారన్నారు.ఈకార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మెన్ కర్నాటి లింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా నాయకులు పబ్బు యాదగిరి పాల్గొన్నారు.