Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్
నవతెలంగాణ -భువనగిరిరూరల్
అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావుపూలే ఆశయాలను, ఆదర్శాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని సమసమాజ నిర్మాణానికి పాటుపడాలని జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ పిలుపునిచ్చారు. మహాత్మ జ్యోతిబాపూలే జయంతిని పురస్కరించుకుని ఆదివారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవభారత నిర్మాణానికి నాంది పలికిన దార్శనికుడిగా పూలే అని అభివర్ణించారు.కుల నిర్మూలన కోసం రాజీలేని పోరాటం చేశారని సామాజిక అసమానతలపై ఉద్యమం చేసిన వీరుడు కొనియాడారు. నూట యాభై ఏండ్ల క్రితమే స్త్రీవిద్య కోసం ఆలోచించిన మేధావి అని, సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు విద్య నేర్చుకొని అభివద్ధి చెందాలని ఆనాడే ఆలోచించాలని అన్నారు.పుస్తక పఠణం పూలేకు ఎంతో ఆసక్తి అయినందున ఆయన తన ఆలోచనలకు పదును పెట్టి బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన సామాజిక తత్వవేత్త అని అభివర్ణించారు. నేటి యువత పూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సామాజిక బాధ్యతగా అన్ని రంగాలలో దేశ అభివద్ధికి సామాజిక వికాసానికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు శ్రీనివాస్ రెడ్డి, కిమియానాయక్ , బీసీసంక్షేమ అధికారి యాదగిరి, కలెక్టరేట్ పర్యవేక్షకులు నాగేశ్వర చారి, డీఏఓ ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.
మాస్కులు తప్పనిసరి జీవో జారీ
నిబంధనలు అతిక్రమిస్తే రూ.1,000 జరిమానా
కరోనా ఉధృతి నేపథ్యంలో మాస్కు తప్పని సరిగా ధరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు నెంబర్ 82 ను జారీ చేసిందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ తెలిపారు. ఆదివారం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ను పోలీసు అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలని జీవోలో పేర్కొన్నట్టు తెలిపారు. మాస్కు తప్పనిసరిగా ఉపయోగించాలని నిబంధనలు అతిక్రమిస్తే 1,000 జరిమానా విధించినట్టు తెలిపారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధ్యక్షతన విపత్తుల నిర్వహణ కమిటీ రాష్ట్ర స్థాయి కార్యనిర్వాహక కమిటీ ఈ మేరకు జిల్లా కలెక్టర్లు పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జీఓ ను విడుదల చేసిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరాన్ని పాటించాలి అని, శానిటేషన్ చేసుకోవాలని సూచించారు.