Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
మాస్కుల ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని పోలీసుశాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నారు. ఒక పక్క ప్రజలకు అవగాహన కల్పిస్తునే మరోపక్క మాస్కులు ధరించని వారికి జరిమానాలు, కేసులు నమోదు చేస్తూ చేస్తున్నారు. ఆదివారం ఉదయం 5-00 గంటల నుండి నల్లగొండ పట్టణంలో అదివారం ట్రాఫిక్ సిఐ దుబ్బ అనిల్ కుమార్ నేతత్వంలో నాగార్జున డిగ్రీ కళాశాల వాకర్స్‌కు మాస్కులు ధరించాల్సిన ఆవశ్యకతను అర్ధమయ్యేలా వివరించారు. మాస్కులు లేకుండా వాకింగ్ కు వచ్చిన పలువురికి మాస్కులు అందించి విధిగా మాస్కు ధరించాలని సూచించారు. కరోనా రెండవ దశ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో మాస్కులు ధరించడం ద్వారా మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడంలో బాధ్యతాయుతమైన పాత్ర వహించాలని కోరారు. మాస్కులు ధరించని వారికి జరిమానాలతో పాటు కేసులు తప్పవని హెచ్చరించారు.అనంతరం పట్టణంలో వివిధ ప్రాంతాలలో మాస్కులు ధరించని ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు. కార్యక్రమంలో సిఐ దుబ్బ అనిల్ కుమార్ తో పాటు ఏఎస్ఐలు జహంగీర్, సుధాకర్, సిబ్బంది మహేందర్, వెంకట్ రెడ్డి తదితరులున్నారు.