Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అణగారిన పేదలకు అక్షరాన్ని దూరం చేస్తుంది
- మహాత్మ జ్యోతిరావుపూలేకు నివాళులర్పించిన ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ - భువనగిరి
మనువాద సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన జ్యోతిరావు పూలే విధానాలను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తూ నూతన విద్యా విధానం పేరుతో మనువాద విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టి అణగారిన పేదలకు అక్షరాన్ని దూరం చేస్తుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి విమర్శించారు. ఆదివారం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని స్థానిక జగదేవపూర్ చౌరస్తా లో ఉన్న పూలే విగ్రహానికి ఆయన నపూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీల హక్కుల కోసం అయితే పూలే కషి చేశాడో నేడు ఆ స్త్రీలపై జరుగుతున్న హింసను బీజేపీ తిరిగి తీసుకు వస్తోందని ఆవేదన వ్యక్తపరిచారు. కరోనా కాలంలో బడుగు బలహీన వర్గాలకు సహాయం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మూడు రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి రైతులకు ఉరితాళ్లు వేస్తుందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ, దళిత గిరిజన బలహీనవర్గాల రిజర్వేషన్లు తొలగిస్తున్నారని చెప్పారు. వేల సంవత్సరాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లు గా మార్చి కార్మికుల పొట్టలు కొట్టి బడా కార్పొరేట్లకు సంపాదన కట్టబెడుతున్నారని విమర్శించారు. బడ్జెట్లో విద్య వైద్యానికి తక్కువ నిధులు కేటాయించి బడుగు బలహీన వర్గాలకు విద్య వైద్యం ఆరోగ్యం దూరం చేసే విధంగా ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నారన్నారు. జ్యోతిరావు పూలే ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని కోరారు. బడుగు బలహీన వర్గాలు దళితులు గిరిజనులు మరింత విద్యావంతులుగా తయారు కావాలని అప్పుడే నిజమైన నివాళులు అర్పించిన వాళ్లు అవుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ముక్కెర యాదయ్య ,ప్రధాన కార్యదర్శి సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు సంగు వనిత ,జిల్లా కార్యదర్శి దొడ్డి స్వామి ,మండల శాఖ అధ్యక్షులు గుజ్జు బాలయ్య, సీనియర్ నాయకులు ఐలేని సంజీవరెడ్డి ,సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.