Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం
నవతెలంగాణ-గుండాల
గుండాల మండలానికి దేవాదుల కాల్వలు పూర్తి చేయకపోవడంతో సాగునీరు లేక రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ,సాగునీరు అందించడంలో పాలకులు పూర్తిగా విఫలమైయ్యారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం అన్నారు.శనివారం రాత్రి మరిపడిగ గ్రామంలో నిర్వహించిన జనచైతన్య పాదయాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండాల మండలానికి సాగునీరు అందించాలంటే నవాబుపేట రిజర్వాయర్ ద్వారా కాల్వలను పూర్తిచేసి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.ఈ పాదయాత్రలో బందం సభ్యులు ఆ పార్టీ రాష్ట్ర కమిటీి సభ్యులు కొండమడుగు నర్సింహా,జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, బట్టుపల్లి అనురాధ, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దరావత్ రమేష్ నాయక్, మండల కార్యదర్శి మద్దెపురం రాజు తదితరులు పాల్గొన్నారు.