Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాటూరి బాలరాజు
నవతెలంగాణ-గుండాల
53 శాతం ఉన్న బీసీ కులాలు రూ.25 వేల కోట్ల నిధులు కేటాయించి చేతి వత్తులను ఆధునికీకరణ చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాటూరి బాలరాజు గౌడ్ డిమాండ్ చేశారు.ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం సీపీఐ(ఎం) చేపట్టిన జనచైతన్య పాదయాత్ర గంగాపురం గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 2018 ఎన్నికల్లో అనేక వాగ్దానాలు ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం చేతి వత్తిదారులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని, చేతి వత్తులను ఆధునికీకరణ అని మోసపూరిత మాటలు చెప్పి అమలు చేయడం లేదన్నారు. 19 రోజులుగా145 గ్రామాల్లో పాదయాత్ర బందానికి19వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. గీత, మత్స్యకారులకు టూవీలర్ వాహనాలు, వ్యక్తిగత రుణాలు కుటుంబానికి రూ.2 లక్షలు ఇవ్వాలని, గీత కార్మికులకు ఎక్స్ గ్రేషియా చెల్లింపు మెడికల్ బోర్డు విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలో సివిల్ సర్జన్ డాక్టర్ ద్వారానే ఎక్స్ గ్రేషియా చెల్లించాలని,నీరా, తాటి ఉత్పత్తుల పరిశ్రమలు జిల్లాకో యూనిట్ ఏర్పాటు చేసి చదువుకున్న గీతకార్మికుల కుటుంబాల యువతి, యువకులకు నైపుణ్యమైన శిక్షణ ఇచ్చి బతుకుదెరువు కల్పించాలని డిమాండ్ చేశారు. , నందనంలో ఏర్పాటు చేసిన తాటి ఉత్పత్తుల పరిశ్రమకు రూ.500 కోట్లు కేటాయించాలని, మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ కాంట్రాక్టర్ల ద్వారా కాకుండా నేరుగా సొసైటీలకు అప్పగిస్తే మత్స్యకారులు మంచి సీడ్ తెచ్చుకుని అధిక లాభాలు పొందుతామని, క్షౌర వత్తి దారులకు 100 యూనిట్లకు ఉచిత విద్యుత్ వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జిల్లాలోని 184 గ్రామాల్లో ప్రజల నుండి వచ్చిన ఆయా సమస్యలన్నీ ఏప్రిల్ 22 న భువనగిరి లో జరిగే సభ ద్వారా ప్రభుత్వం, కలెక్టర్ దష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా చూస్తామన్నారు.లేదంటే మే, జూన్ మాసాల్లో వీటన్నింటిపై కార్యాచరణ రూపొందించిన ప్రజాపోరాటలు చేస్తామన్నారు. అన్ని గ్రామాల్లోనూ ప్రజలను చైతన్య పరిచి 22న జరిగే సభకు హాజరయ్యేలా చేసి సభను విజయవంతం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, పాదయాత్ర బందం సభ్యులు కొండమడుగు నర్సింహ్మ ,కల్లూరి మల్లేశం, మాటూరి బాలరాజు,బట్టుపల్లి అనురాధ, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎంవి రమణ, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, ధరావత్ రమేష్, కల్లు గీత కార్మిక సంఘం జనగామ, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కార్యదర్శులు బాల్నే వెంకటమల్లయ్య, ఉషబోయిన వెంకటనర్సయ్య, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి,గుండు వెంకట్ నర్సు,మండల కార్యదర్శి మద్దెపురం రాజు, సీఐటీయూ కార్యదర్శి పోతరబోయిన సత్యనారాయణ, సోషల్ మీడియా పింగిలి విజరు రెడ్డి, ఎండి.వజీర్,సురేష్, వీరస్వామి, శంకర్, బాలయ్య, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.