Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ , మోడీ దొందూ దొందే
- సీపీఐ(ఎం) జనచైతన్య పాదయాత్ర రథసారధి ఎండి జాహంగీర్
- మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు
నవతెలంగాణ- ఆలేరు రూరల్
ప్రజా సమస్యలపై పోరాడే ది ఎర్ర జెండా పార్టీ మాత్రమేనని సీపీఐ(ఎం) జనచైతన్య పాదయాత్ర రథసారధి, జిల్లా కార్యదర్శి ఎండి.జాహంగీర్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం సీపీఐ(ఎం) చేపట్టిన జనచైతన్య పాదయాత్ర ఆదివారం మండలంలోని గొలనుకొండ గ్రామానికి చేరుకుంది. పాదయాత్ర బృందానికి గ్రామస్తులు బతుకమ్మలతో స్వాగతం పలికారు. పాదయాత్ర బృందం మహాత్మజ్యోతిరావుపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాలులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి మోరిగాడి రమేష్ అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామంలో ముఖ్యంగా ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన భూమి గురించి ఎర్ర జెండా పార్టీ ముందుండి సమస్య పరిష్కారం చేసేందుకు కషి చేసిందన్నారు . కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర ధరలు పెంచి ప్రజల నడ్డి విడిచేలా చూస్తుందన్నారు. ప్రధాని మోడీ ఏడేండ్లపాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ మోడీతో లాలూచీ పడ్డారన్నారు. కేసీఆర్, మోడీ దొందూదొందే అని ప్రజలు వారిని నమ్మే పరిస్థితి లేదన్నారు. త్వరలోనే ప్రజల తిరుగుబాటు వస్తుందన్నారు. గంధమల్ల ప్రాజెక్టు ప్రభుత్వం ఇచ్చిన హామీ నమ్మి టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఓటేసి గెలిపిస్తే ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఒక్కరు కాదు ఏడుగురు పాదయాత్ర చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాదయాత్ర బృందం సభ్యులు కొండమడుగు నరసింహ ,మాటూరి బాలరాజ్ గౌడ్, బట్టుపల్లి అనురాధ ,కోమటిరెడ్డి చంద్రారెడ్డి, రవినాయక్ ,కల్లూరి మల్లేశం ,సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నరసింహులు, మండల నాయకులు ఉప్పలయ్య, వెంకటేష్ ,సత్య రాజయ్య ,వెంకటేష్ ,గ్రామ కార్యదర్శి సంగి రాజు ,్ట సీనియర్ నాయకులు బోడ హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.