Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి
నవతెలంగాణ-గుండాల
నూతన జిల్లాల అభివద్ధికి నిధులు కేటాయించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు. సీపీఐ(ఎం) చేపట్టిన జన చైతన్య పాదయాత్ర 20 వరోజు ఆదివారం గుండాల మండలంలో వెల్మజాల గ్రామానికి చేరుకుంది. సిద్దిపేట జిల్లా నాయకులతో కలిసి మల్లారెడ్డి పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నూతన జిల్లాలు ఏర్పాటు చేసి నాలుగేండ్లు గడుస్తున్నా అభివృద్ధి జరగలేదన్నారు. జిల్లాల్లో విద్యా, వైద్య రంగాలను అభివద్ధి చేయకుండా సాగు, తాగునీరు ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ప్రజల అభివద్ధి సాధ్యమా అని ప్రశ్నించారు.యాదాద్రి జిల్లా హైదరాబాద్కు అతి చేరువలో ఉన్న నేటికి ఇంకా మారుమూల ప్రాంతాల్లో, మండలాల్లో అభివృద్ధి జరగలేదన్నారు. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి కలిపే లింక్ రోడ్లు కూడా సరిగ్గా లేవన్నారు. తమ జిల్లాలో కూడా ఇదే పరిస్థితులు నెలకొన్నాయని వీటి పరిష్కారానికి యాదాద్రి భువనగిరి జిల్లాలో జరుగుతున్న జన చైతన్య పాదయాత్ర స్పూర్తితో సిద్దిపేట జిల్లా వ్యాప్త సమస్యలపై కూడా పోరాడుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాదయాత్ర బందం సభ్యులు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా,జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, బట్టుపల్లి అనురాధ, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దరావత్ రమేష్ నాయక్, మండల కార్యదర్శి మద్దెపురం రాజు తదితరులు పాల్గొన్నారు.