Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
పీడిత ప్రజల అభ్యున్నతికి కషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావుఫూలే అని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సీహెచ్. రాములు అన్నారు.మహాత్మాజ్యోతిరావుఫూలే జయంతి సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని స్థానిక టీఎస్‌యూటీఎఫ్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి రాములు పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సంఘసంస్కర్తగా, తత్వవేత్తగా, సామాజిక వేత్తగా పేరొందిన మహా నాయకుడు అని అన్నారు. సమాజంలోని ఆర్థిక, అసమానతలపై నిరంతరం పోరాడి,ప్రశ్నించే గొంతుక అయ్యాడని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి ఎన్.సోమయ్య, అధికారి కోశాధికారి వెంకటేశ్వర్లు, వీరారెడ్డి, వెంకన్న, పాపిరెడ్డి, పి.అనిల్‌కుమార్, సిహెచ్.రమేశ్, క్రాంతిప్రభ, బి.రమేశ్, సీనయ్య, సైదా,వేణు, రత్నకుమారి,రాఘవులు పాల్గొన్నారు.
అదేవిధంగా అణగారిన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు ఫూలే అని జిల్లా అదనపు కలెక్టర్ మోహన్‌రావు అన్నారు.జిల్లా కేంద్రంలోని ఫూలే విగ్రహానికి ఆయనతో పాటు ప్రముఖులు పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్, ఉమ్మడి నల్లగొండ డీసీఎంఎస్ చైర్మెన్ వట్టెజానయ్యయాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీ వైస్‌చైర్మెన్ గోపగాని వెంకట నారాయణగౌడ్, మున్సిపల్ వైస్‌చైర్మెన్ పుట్ట కిషోర్‌కుమార్, మాజీ మున్సిపల్ చైర్మెన్ జుట్టుకొండ సత్యనారాయణ,ఓబీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తండు శ్రీనివాస్‌యాదవ్, సూర్యాపేట ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి,బీసీ సంఘం నాయకులు చల్లమల్ల నర్సింహ, వసంత సత్యనారాయణ పిల్లే, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తల్లమల్ల హుస్సేన్,టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతలపాటి చిన్న శ్రీరాములు,సీపీ(ఐ)ఎం పట్టణ టూ టౌన్ కార్యదర్శి కోట గోపి,టీఎన్జీవో జిల్లా కార్యదర్శి దున్న శ్యామ్,ఊర గాయత్రి పాల్గొన్నారు.
తుంగతుర్తి :మండలకేంద్రంలో ఫూలే విగ్రహాలకు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్ మందుల సామేల్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో టీఎన్ఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పాల్వాయి పరుశరాములు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేపాక సాయిబాబా, ఎంఎస్ఎఫ్ నియోజకవర్గ ఇన్చార్జి తడకమళ్ల రవికుమార్, ఎంఈఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి మల్లేపాక రవీందర్, మండల అధ్యక్షులు గాజుల మహేందర్,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు పెద్దబోయిన అజరు, ఎన్ఎస్యూఐ నియోజకవర్గ ఇన్చార్జి కొండ నాగరాజు, బొంకురి మల్లేష్, మధుబాబు పాల్గొన్నారు.
అదేవిధంగా మండలకేంద్రంలో ఫూలే విగ్రహానికి ఎంపీపీ గుండగాని కవితారాములుగౌడ్ పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు ఓరుగంటి సత్య నారాయణ, మండల ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వర్లు, దేవాలయ కమిటీ చైర్మెన్ ముత్యాల వెంకన్న, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పులుసు వెంకటనారాయణగౌడ్, ఎల్లబోయినభిక్షం, బత్తుల జలంధర్, గుణగంటి సంతోష్, కటకం సూరయ్య, దుగ్యాల హనుమంతరావు, తాటిపాముల వెంకన్న, గోపగానివెంకన్న పాల్గొన్నారు.
కోదాడరూరల్ : పట్టణంలో హమాలి అడ్డా వద్ద జ్యోతిరావు ఫూలే 194వ జయంతి నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి ముత్యాలు ఫూలే చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కమిటీ సభ్యులు దాసరి శ్రీనివాస్, నవీన్, రవి, కాటయ్య, రాములు, గురవయ్య పాల్గొన్నారు.
చివ్వెంల : మండలపరిధిలోని వట్టిఖమ్మంపహాడ్లో ఫూలే చిత్రపటానికి టీఆర్ఎస్ జిల్లా నాయకులు కలకొండ శ్యాంసన్ పూలమాలలేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగ్గ సంఘ సంస్కర్త, గొప్ప మేధావి, నిజమైన మహాత్ముడు జ్యోతిరావు ఫూలే అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రావిచెట్టు సత్యం, షేక్దస్తగిరి, మట్టపల్లి లింగయ్య, వీరబోయిన పోతయ్య, బయ్యలక్ష్మణ్, నవిలే ఈదయ్య పాల్గొన్నారు.
సూర్యాపేటరూరల్: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఫూలే చిత్రపటానికి ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ జీడిభిక్షం పూలమాలలేసి నివాళులర్పించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్‌నాయుడు, కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ గాలిబ్, ఎంఈఓ శైలజ పాల్గొన్నారు.
నేరేడుచర్ల : టీఎస్‌యూటీఎఫ్ నేరేడుచర్ల, పాలకవీడు, గరిడేపల్లి మండలాల ఆధ్వర్యంలో నేరేడుచర్ల ప్రాంతీయ కార్యాలయంలో ఫూలే జయంతి నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు సిరికొండ అనిల్‌కుమార్, జిల్లా కార్యదర్శి రవీందర్‌రెడ్డి, జిల్లా ఆడిట్కమిటీ షభ్యులు సాంబయ్య, పాలకవీడు మండల అధ్యక్షుడు ఆర్.గ్రీనయ్య, గరిడేపల్లి శాఖ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు రాంబాబు, నాగేశ్వర్రావు, నేరేడుచర్ల మండలం శాఖ ప్రధాన కార్యదర్శి అక్కయ్యబాబు, సీనియర్ నాయకులు పి. వెంకటేశ్వర్లు, రషీద్‌ఖాన్, వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, నాగార్జున పాల్గొన్నారు.
యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో జ్యోతిరావుఫూలే 195 వ జయంతి వేడుకలు నిర్వహించారు.ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోంబాబు, పూర్వ అధ్యక్షులు, పూర్వ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మంగ, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎన్.నాగేశ్వరరావు ఫూలే చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మండలాల బాధ్యులు జనార్దన్, నక్క శ్రీనివాస్, బి.నాగేశ్వరరావు, వి.శ్రీనివాసచారి, లక్ష్మీనారాయణ, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు ఆడమ్, అనిల్‌కుమార్, క్రాంతిప్రభ, ఖాజామియా పాల్గొన్నారు.